Site icon Prime9

Bulldozer demolitions: మధ్యప్రదేశ్ లో ప్రారంభమైన బుల్ డోజర్ కూల్చివేతలు

Bulldozer demolitions started in MP

Bulldozer demolitions started in MP

Madhyapradesh: నిందితులకు తగిన గుణపాఠం పేరుతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్య నాధ్ తీసుకొచ్చిన బుల్ డోజర్ వ్యవస్ధను భాజాపా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలుపరిచింది. ఈమేరకు ఓ సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందుతుల ఇండ్లను బుల్ డోజర్లతో కూల్చివేసి ప్రజల ప్రభుత్వంగా చెప్పుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనాయి.

సమాచారం మేరకు, రేవా జిల్లాలోని నయాగర్హి దేవాలయానికి ఓ టీనేజ్ బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రావడాన్ని ఆరుగురు యువకులు గుర్తించారు. అనంతరం ఆమె పై సామూహికంగా అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత నిందితులు ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించారు. సామూహిక అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పలు ఐపీసీ, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మిగిలిన నిందుతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రజల్లో ధైర్యాన్ని, నేరం చేసిన వ్యక్తుల గుండెల్లో గుబులను పుట్టించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుల్ డోజర్ వ్యవస్ధకు శ్రీకారం చుట్టింది. కాగా పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు బుల్ డోజర్ సంస్కృతిని తప్పుబడుతున్నారు. పలు కేసుల్లో నిందితులు కోర్టు తీర్పులతో తప్పించుకొని వున్నారు. అలాంటి సమయాల్లో కేసు నిర్దారణ కాకుండానే బుల్ డోజర్ తో వారి ఇండ్లను కూల్చివేస్తే అనంతరం కోర్టు ఏ మేరకు స్పందిస్తుంది. బాధితులకు తిరిగి ఇండ్ల నిర్మించడం వంటి పలు అనుమానాలు మేధావుల్లో వ్యక్త మవుతుంది.

Exit mobile version