Brij Bhushan Sharan Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లను బెదిరించారని, వారిని మౌనంగా ఉండమని కోరారని, ఈ కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై కొత్తగా వాదనలు ప్రారంభమవడంతో ఢిల్లీ పోలీసులు గురువారం ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
మహిళా రెజ్లర్లతో..( Brij Bhushan Sharan Singh)
మీరు రెజ్లింగ్ కొనసాగించాలనుకుంటే ఉండండి.నేను ఎవరి కెరీర్‌ని అయినా నాశనం చేయగలను అంటూ బ్రిజ్ భూషణ్ బెదిరించారని తెలిపారు. ఢిల్లీ పోలీసు న్యాయవాది అతుల్ శ్రీవాస్తవ బ్రిజ్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు నేరపూరిత బెదిరింపులతో వ్యవహరించే ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 506 ప్రకారం నేరం అని వాదించారు. డబ్ల్యుఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ కార్యాలయంలోకి మహిళలకు మాత్రమే అనుమతి ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తోమర్ కార్యాలయానికి తలుపులు మూసి ఉంచారని మగవారిని లోపలికి రానీయకుండా ఆపివేసినట్లు చెప్పారు. ఇది వారి ఉద్దేశ్యాన్ని తెలియజేస్తోందని అని శ్రీవాస్తవ పేర్కోన్నారు. ఢిల్లీ పోలీసు న్యాయవాది బ్రిజ్ భూషణ్ ఒక రెజ్లర్‌ను కౌగిలించుకున్న సంఘటనను కూడా ప్రస్తావించారు.
మరోవైపు రూస్ అవెన్యూ కోర్టు మినహాయింపును అనుమతించడంతో బ్రిజ్ భూషణ్ గురువారం విచారణకు హాజరుకాలేదు. సామాజిక బాధ్యత కారణంగా మినహాయింపు కోరినట్లు అతని న్యాయవాది చెప్పారు.అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ముందు పోలీసులు ఈ వాదనలు వినిపించారు. న్యాయమూర్తి హర్జీత్ సింగ్ జస్పాల్ ఇటీవలే వేరే కోర్టుకు బదిలీ అయిన తర్వాత ఈ విషయంపై విచారణ ప్రారంభించారు.ఢిల్లీ పోలీసులు గత ఏడాది జూన్ 15న బ్రిజ్ భూషణ్‌పై సెక్షన్‌లు 354 (ఆమె నమ్రతను అగౌరవపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 354A (లైంగిక వేధింపులు), 354D (వెంబడించడం) మరియు 506 (నేరపూరిత బెదిరింపు) కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బ్రిజ్ భూషణ్‌కు బెయిల్ మంజూరు చేసిన హర్జీత్ సింగ్ జస్పాల్ గతేడాది జూలై 20న డబ్ల్యూఎఫ్‌ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్‌ను సస్పెండ్ చేశారు.