Site icon Prime9

Bride: స్మార్ట్ పెళ్లి కూతురు.. మెట్రోలో పెళ్లి మండపానికి వధువు..!

bride

bride

Bride: దేశంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. దీంతో కార్యాలయాలకు , పనులపై బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటికి చేరాలంటే కనీసం రెండు మూడు గంటలైన పడుతుంది.

Bengaluru లో నవ వధువు మెట్రోలో పెళ్లి మండపానికి వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లి మండపానికి బయలుదేరిన నవవధువు ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఇది కాస్త నవ వధువును కంగారు పెట్టింది.

పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో కంగారు పడిన వధువు.. చురుగ్గా ఆలోచించింది.

అనుకున్నదే తడవుగా మెట్రోలో పెళ్లి మండపానికి సమయానికి చేరుకుంది.

పెళ్లికి వచ్చేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆలస్యంగానైనా వస్తారు కావచ్చు.

కానీ పెళ్లి చేసుకోవాల్సినవారే ట్రాఫిక్‌లో చిక్కుకుంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

మెుత్తానికి పెళ్లికి ఆలస్యంగా కాకుండా.. మెట్రో రైల్లో ఎక్కి మండపానికి చేరుకుంది వధువు.

నగలు ధరించి మెట్రోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి.

ఇంటి నుంచి మండపానికి కారులో బయలు దేరిన వధువు.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది.

ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. ముహూర్తం సమీపిస్తుండటంతో.. స్మార్ట్ గా ఆలోచించింది.

వెంటనే ట్రాఫిక్ లో కారు దిగి మెట్రో ఎక్కేసింది. నవ వధువు మెట్రో ఎక్కడం ఏంటని ప్రయాణికులు ఆశ్యర్యానికి గురయ్యారు.

తర్వాత ఈ విషయం తెలియడంతో ప్రయాణికులు నవ వధువును మెచ్చుకుంటున్నారు.

స్మార్ట్ గా ఆలోచించి.. సమయానికి పెళ్లి మండపం చేరిందని ప్రశంసించారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది. ఇది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ట్రాఫిక్ కష్టం నుంచి సమయస్ఫూర్తితో ఆలోచించింది అంటూ ప్రశంసిస్తున్నారు.

స్మార్ట్ పెళ్లికూతురు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

రాను రాను మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతుంది.

ట్రాఫిక్‌ సమస్యలను తీర్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం లేదు.

బెంగుళూరులో ట్రాఫిక్‌ పరిస్థితి తెలియజెప్పే వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version