Site icon Prime9

Maharashtra Terror Scare: మహారాష్ట్రలో భారీ కుట్రకు ఉగ్రవాదుల పన్నాగం.. రెండు అనుమానాస్పద బోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Maharashtra: మహారాష్ట్రలో ఉగ్రవాదులు మరో భారీ కుట్రకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ముంబై నుంచి రాయ్‌ఘడ్‌ వెళ్లే మార్గంలో ఉన్న హరిహరేశ్వర్‌ బీచ్‌లో అనుమానాస్పద బోట్లను పోలీసులు గుర్తించారు. రెండు బోట్లలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి లభ్యమైంది. 3 ఫుల్లీ లోడెడ్‌ ఏకే 47 గన్స్‌, భారీగా బులెట్స్‌ కూడా బోట్లలో ఉన్నాయి. దాడికి సిద్ధంగా ఉన్న మాదిరిగా గన్స్‌ లోడ్‌ చేసి పెట్టారు నిందితులు. దీంతో ముంబైలో హైఅలెర్ట్‌ ప్రకటించారు.

మరోపక్క ఎన్‌ఐఏ బృందం ఘటనాస్థలానికి బయల్దేరింది. 2008లో ముంబైలో దాడి చేసిన మాదిరిగానే ఉగ్రవాదులు దాడులకు తెర లేపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2008లో దాడి జరిగిన సమయంలో కూడా కసబ్‌ అతని బృందం బోట్‌లోనే ముంబైకి చేరుకున్నారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి దాడులు చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులకు దొరికిన బోట్‌ నెఫ్ట్యూన్‌ మారటైన్‌ సెక్యూరిటీ పేరుమీద రిజిస్టర్‌ అయిఉంది. ఈ సంస్థ యూఏఈ కేంద్రంగా పని చేస్తోంది. అయితే ఈ బోట్‌లో వచ్చిన వ్యక్తులు ఎవరు, వాళ్లు ఎక్కడికి వెళ్లారు అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ రెండు బోట్లను ఇక్కడ వదిలి వెళ్లారా లేక బోట్‌లో వచ్చి వాళ్లకు ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version