Site icon Prime9

BJP MP CP Joshi: లంచం అడిగిన అధికారిని కొట్టిన బీజేపీ ఎంపీ

bjp-mp-joshi

bjp-mp-joshi

Chittorgarh: రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సీపీ జోషికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, బీజేపీ ఎంపీ సీపీ జోషి ప్రభుత్వ కార్యాలయంలో అందరి ముందు ఒక ఉద్యోగిని కొట్టడం కనిపిస్తుంది. తమ వద్ద రూ.5000 లంచం తీసుకున్నాడని రైతులు ఫిర్యాదు చేయడంతో బీజేపీ ఎంపీ సీపీ జోషి సదరు ఉద్యోగిని కొట్టినట్లు చెబుతున్నారు. బీజేపీ ఎంపీ సీపీ జోషి ఆ ఉద్యోగిని కొట్టినపుడు పలువురు రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అక్కడే నిలబడి ఉన్నారు.

భూమి మార్పిడి కోసం ఒక్కో రైతు వద్ద ఉద్యోగి రూ.5000 లంచం తీసుకున్నాడని రైతులు ఆరోపిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నాయి. అప్పుడు రూ.15 వేల వరకు లంచం అడిగాడంటూ మరికొందరు రైతులు చెబుతున్నారు. ఇది విన్న బీజేపీ ఎంపీకి కోపం వచ్చి ఆ ఉద్యోగి ముఖంపై గట్టిగా కొట్టాడు. ఉద్యోగి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు చెప్పడంతో ఎంపీ ఉద్యోగిని పిలిపించి అడిగి వెంటనే కొట్టారు. దీంతో పాటు ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులను హెచ్చరించారు. సదరు ఉద్యోగిని బీజేపీ ఎంపీ సీపీ జోషి కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి జనాలు రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు. కొందరు ఎంపీని అభినందిస్తే, మరికొందరు ఎంపీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

భాజపా జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ కుమావత్‌ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆ శాఖలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీని పై ఎంపీ సీపీ జోషి మంగళవారం సాయంత్రం ఆ శాఖ కార్యాలయానికి చేరుకోవడంతో వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చిందన్నారు.

Exit mobile version