Site icon Prime9

R Krishnaiah: మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య

BJP declares candidates for Andhra Pradesh, Haryana and Odisha Rajya Sabha bypolls: బీజేపీ రాజ్యసభ ఉపఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు గానూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్‌ పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా, ఏపీ నుంచి బీజుపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యకు అవకాశం రాగా.. మంగళవారం నామినేషన్ వేయనున్నారు. కాగా, బీసీ ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య ఇటీవల వైసీపీతో పాటు రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేశారు. ఆయన గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ తనకు మరోసారి అవకాశం కల్పించడం గమనార్హం.

కాగా, రాజ్యసభ ఉపఎన్నికల నామినేషన్ రేపటితో చివరి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్ వేయనున్నారు. ఇక, డిసెంబర్ 20న రాజ్యసభకు ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా రానున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులు రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాల నుంచి ఒక్కో సీటు ఖాళీగా ఉన్నాయి.

ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు నామినేషన్ వేయనున్నారు. అయితే కూటమి తరఫున మూడో అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడలేదు. కానీ సానా సతీష్ సహా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబునాయుడిని ఆశవాహులు కలిసి విన్నవించుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం వరకు మూడో అభ్యర్థి పేరు కూడ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version