Election Results: మూడు ఈశాన్య రాష్ట్రాలయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీని దక్కించుకుంది. మేఘాలయలో మాత్రం ఎన్ పి పి అతి పెద్ద పార్టీగా అవతరించనుంది.
రెండు రాష్ట్రాల్లో బీజేపీ జోరు..(Election Results)
త్రిపురలో మెత్తం 60 సీట్లకు గాను బీజేపీ కూటమి 33 స్దానాల్లో, కాంగ్రెస్ కూటమి 15, టీఎంపీ 11. ఇతరులు 1 స్దానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నాగాలాండ్ లో మొత్తం 60 సీట్లకు గాను బీజేపీ కూటమి 35 స్దానాల్లో, కాంగ్రెస్ 3 స్దానాలు, ఎన్ పీ ఎఫ్ 3 స్దానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మేఘాలయలో 60 సీట్లలో ఎన్ పీ పీ 27, యుడీపీ 6, బీజేపీ 5, టీఎంసీ 5 స్దానాల్లోమ ఆధిక్యంలో ఉన్నాయి.త్రిపురలో కొత్తగా ఏర్పాటైన రాజకీయ పార్టీ టిప్రా మోతావిత్ బిజెపి-ఐపిఎఫ్‌టి మరియు కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్ కూటములకు గట్టి పోటీ నెలకొంది.. 2021 త్రిపుర గిరిజన ప్రాంతాల అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (TTAADC) ఎన్నికలలో ఈ పార్టీ 30 సీట్లలో 18 కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టిప్రా మోతా ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. 20 గిరిజన ఆధిపత్య స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.అయితే చివరకు బీజేపీ కూటమి పై చేయి సాధించినట్ల ఫలితాలు తెలియజేస్తున్నాయి.
బీజేపీతో జతకట్టనున్న ఎన్‌పీపీ ?
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ఎన్‌పీపీ ఎంపీ వాన్‌వీరోయ్ ఖర్లూఖీ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఎన్‌పిపి ఎప్పుడూ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడదు, వారు తమను తాము నిజాయితీగా ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (మేఘాలయ), భారతీయ జనతా పార్టీ (BJP)తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం రాత్రి గౌహతిలోని ఓ హోటల్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను కలిశారు.సంగ్మా గత రాత్రి గౌహతిలో ఉన్నారు. శర్మ, అతని స్నేహితుడు వచ్చి అతనిని హోటల్‌లో కలిసారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.