Site icon Prime9

Bird Flu In India: ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్ అమ్మకాలు నిషేధం

Bird Flu In India

Bird Flu In India

Bird Flu In India: జార్ఘండ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా బర్డ్ ఫ్లూ కారణంగా 4 వేల కోళ్లు, బాతులను చంపివేయాలని జార్ఘండ్ బొకారో జిల్లా అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

మరీ ముఖ్యంగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కడక్ నాథ్ కోళ్లలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయోంజా వైరస్ ను కనుగొన్నట్టు చెప్పారు . కడక్ నాథ్ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందాయన్నారు. వ్యాధి సోకిన 103 కోళ్లను అధికారులు చంపేసినట్టు పేర్కొన్నారు.

కోళ్లు, బాతులతో సహా(Bird Flu In India)

అదేవిధంగా ప్రభుత్వ కోళ్ల ఫారమ్ కు ఒక కిలో మీటర్ పరిధిలో ఉన్న కోళ్లు, బాతులతో సహా మొత్తం 3,856 పక్షులను చంపనన్నుట్టు పశు ఆరోగ్య, ఉత్పత్తి డైరెక్టర్ బిపన్ బిహారీ మహ్తా పేర్కొన్నారు.

ఫిబ్రవరి 2 నుంచి ప్రభుత్వ ఫారమ్ లో కోళ్లు చనిపోవడం మొదలైందని..

వ్యాధి నమూనాలు ల్యాబ్ కు పంపితే బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ అయిందని ఆయన వెల్లడించారు.

చికెన్ విక్రయాలపై నిషేధం

కోళ్లను నష్టపోయిన యజమానులకు కొంత మేర పరిహారం ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ ప్రక్రియ కూడా మొదలైందని.. ఎవరెవరికి పరిహారం ఇచ్చే విషయాన్ని ఖరారు చేయాలన్నారు.

మరో వైపు బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఫౌల్ట్రీ ఫారమ్ కు 10 కిలో మీటర్ల రేడియస్ లో ఉన్న వాటికి ప్రత్యేక నిఘా పెట్టారు.

అలాగే స్థానిక జిల్లాలో చికెన్ విక్రయాలపై నిషేధం విధించారు. మనుషులు ఎవరినైనా ఈ వైరస్ బారినపడితే ఎలా అనే దానిపై అధికారులు సమీక్ష నిర్వహించారు.

ఒక వేళ చికిత్స అవసరమైన పక్షంలో వెంటనే స్పందించేలా స్థానికంగా ఉండే సదర్ హాస్పిటల్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దక్షిణాసియాలో మొదటి మరణం

2014 తర్వాత దక్షిణాసియా దేశంలో తొలిసారిగా H5N1 వైరస్ ఇన్ఫెక్షన్ కేసుగా గుర్తించారు.

కాంబోడియాలోని ప్రెయ్ వెంగ్ ప్రావిన్స్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్‌తో మరణించిందని అక్కడి ఆరోగ్య మంత్రి మామ్ బున్‌హెంగ్ ది ఇండిపెండెంట్‌తో చెప్పారు.

గ్రామీణ ప్రే వెంగ్ ప్రావిన్స్ కు చెందిన బాలిక తీవ్ర జ్వరం, దగ్గుతో తీవ్ర అస్వస్థతకు గురైంది.
బుధవారం ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం నమ్‌పెన్‌లోని జాతీయ పిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
ఈ విధమైన లక్షణాలు కనిపిస్తున్న ఆమె తండ్రితో పాటు మరో 11 మందికి కూడా వైరస్ కోసం పరీక్షించారు.
Exit mobile version