Site icon Prime9

Biparjoy Cyclone: బిపర్ జోయ్ తుఫాను ..గుజరాత్ లో నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. 1,000 కి పైగా గ్రామాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

Biparjoy Cyclone

Biparjoy Cyclone

Biparjoy Cyclone:  బిపర్ జోయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం మరియు గంటకు 115-125 కిలోమీటర్ల (కిమీ) వేగంతో గాలులు వీచాయి.
వీటి ప్రభావంతో వందలాది చెట్లు కూలిపోయాయి, కమ్యూనికేషన్ టవర్లు దెబ్బతిని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.

లక్షమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు..(Biparjoy Cyclone)

భావ్‌నగర్ నగర శివార్లలోని సోద్వాదర్ గ్రామంలో నీట మునిగిన గొర్రెల మందను కాపాడే ప్రయత్నంలో రామ్ పర్మార్ (55), అతని కుమారుడు రాజేష్ (22) ప్రాణాలు కోల్పోయారు.
గురువారం ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, గిర్ సోమనాథ్, మోర్బి మరియు రాజ్‌కోట్‌లలో కనీసం 23 మంది గాయపడ్డారు. దీని తోపాటు మొత్తం 24 జంతువులు తుపాను ధాటికి మృతి చెందినట్లు సమాచారం.1.08 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.గుజరాత్ తీరం వెంబడి ఎనిమిది జిల్లాలు కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, పోర్ బందర్, జునాగఢ్, గిర్ సోమనాథ్, మోర్బి మరియు రాజ్‌కోట్ లలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది.

1,100 గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా..

బిపర్ జోయ్ తుఫాను ప్రభావంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, ట్నాన్స్ ఫార్మర్లు నేలకూలడంతో గుజరాత్‌లోని సౌరాష్ట్ర మరియు కచ్ ప్రాంతాలలోని దాదాపు 1,100 గ్రామాలు మరియు డజన్ల కొద్దీ పట్టణాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం గురువారం గుజరాత్‌లో ఎన్డీఆర్ఎఫ్ యొక్క 19 బృందాలను మోహరించింది, వీటిలో అత్యధికంగా ఆరు కచ్‌లో ఉన్నాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్ )కి చెందిన 12 బృందాలు కూడా తుఫాను ప్రభావాలను తగ్గించడంలో నిమగ్నమై ఉన్నాయి.గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌లో గురువారం జరిగిన సమావేశంలో, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version