Site icon Prime9

Bilkis Bano Challenges In Supreme Court: సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన బిల్కిస్ బానో

Bilkis Bano

Bilkis Bano

Gujarat: గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో తనపై సామూహిక అత్యాచారంచేసిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. గుజరాత్‌కు బదులుగా తన కేసును విచారణ జరిపిన మహారాష్ట్ర రిమిషన్ పాలసీ నిర్వహించాలని ఆమె వాదించారు. గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం తన అఫిడవిట్‌లో, దోషులందరి “మంచి ప్రవర్తన” కారణంగా మరియు వారు 14 సంవత్సరాలుగా కటకటాల వెనుక గడిపిన కారణంగా వారిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.

బుధవారం సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పీల్‌ను ఓపెన్ కోర్టులో నిర్వహించాలని న్యాయవాది శోభా గుప్తా వాదించారు. ఆ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వడం మానేసిన సీజేఐ, ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాతే లిస్టింగ్‌పై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.గోధ్రా అనంతర హింస నేపథ్యంలో తన గ్రామం నుండి పారిపోయి పొలంలో ఆశ్రయం పొందుతున్నప్పుడు, బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది . ఆమె కుటుంబంలోని 7 మంది సభ్యులను ఒక గుంపు మార్చి 3, 2002న చంపింది.  దీనిపై  సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

నిందితులను 2004లో అరెస్టు చేశారు. జనవరి 21, 2008న జశ్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్‌భాయ్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్‌చంద్ర జోషి, కేశరభాయ్ వహోనియా, ప్రదీప్ మోధియా, బకాభాయ్ వహోనియా, రాజుభాయ్ సోనీ, రమేశ్‌భాయ్ సోనీ, మితేషీలకు శిక్ష పడింది. బాంబే హైకోర్టు 2018లో పైన పేర్కొన్న వ్యక్తులను దోషులుగా నిర్దారించింది. బిల్కిస్ బానోకు ఏడాది తర్వాత రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, ఉద్యోగం మరియు ఇల్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Exit mobile version