Bihar Minister Tej Pratap Yadav:ఆర్జేడీ నేత, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ తన కలలో శ్రీకృష్ణుడిని చూశానని చెప్పారు. మెరిసే చక్రాలతో అలంకరించబడిన కిరీటంతో మరియు ఆయుధాలతో, విశ్వం యొక్క అద్భుతమైన కాంతిగా ప్రతిచోటా ప్రకాశిస్తున్న మీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను అని అన్నారు.వీడియోలో, తేజ్ ప్రతాప్ నిద్రపోతున్నట్లు కనిపిస్తారు. అతను మహాభారత యుద్ధం మరియు శ్రీకృష్ణుడు గురించి కలలు కంటారు. తన కలలో దేవుడిని చూసిన తేజ్ ప్రతాప్ షాక్‌తో మేల్కొంటాడు.
శ్రీకృష్ణుడు, శివుడి వేషాలు ధరించి..(Bihar Minister Tej Pratap Yadav)
తేజ్ ప్రతాప్ గతంలో దేవుళ్ల రూపంలో అలకరించుకుని వార్తల్లో కెక్కారు. శ్రీకృష్ణుని వేషధారణలో తనను తాను దేవుడిగా పోల్చుకునేవారు.. అతను తన సోదరుడు తేజస్వి యాదవ్‌ను ‘అర్జున్’ అని మరియు తనను ‘కృష్ణ’ అని పేర్కొన్నారు.. పాట్నాలోని ఒక శివాలయంలో ప్రార్థనలు చేయడానికి అతను శివుడిలా కూడా వేషాన్ని ధరించారు.బీహార్ పర్యావరణ మంత్రిగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఫిభ్రవరి నెలలో సచివాలయానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. దివంగత సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను “తన కలలో చూసిన” తర్వాత ఆయన నుండి ప్రేరణ పొందానని చెప్పారు. నా జీవితాంతం ములాయం సింగ్ యాదవ్ చూపిన బాటలో నడవడానికి ప్రయత్నిస్తానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ అన్నారు.
కలలో నేతాజీని చూసాను..
ఈరోజు ఉదయం 22.2.2023న నా కలలో దివంగత ములాయం సింగ్‌ని చూశాను. ఆయన నన్ను కౌగిలించుకుని ఆప్యాయంగా ఆశీర్వదించారు.. నా జీవితాంతం ఆయన చూపిన బాటలో నడవడానికి ప్రయత్నిస్తాను.ఈరోజు సైకిల్‌పై నా మంత్రిత్వ శాఖ అరణ్య భవన్‌కు వెళ్తున్నాను అని బీహార్ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి ట్వి్ట్టర్ లో పేర్కొన్నారు.నన్ను చూడగానే తేజ్ ప్రతాప్ హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చాడో అని ఆయన ఆశ్చర్యపోయాడు. నేను వృందావన్‌కి వెళుతున్నాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పాను. నేతాజీ తో ఆయన గ్రామంలో పర్యటించాలనే నా కోరికను వ్యక్తపరిచాను. అప్పుడు నేను ఒక సైకిల్ ఏర్పాటు చేయమని అడిగాను . దానికినేతాజీ మరింత సంతోషించారు అని తేజ్ ప్రతాప్ అన్నారు.సమీపంలోని గ్రామంలో ఒక వివాహానికి హాజరైన తర్వాత ఇద్దరం తిరిగి వచ్చామని ఆయన తెలిపారు.అతను తన చేతి గడియారాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను భావోద్వేగానికి గురయ్యాను మరియు ఏడవడం మొదలుపెట్టాను. నేతాజీకి కూడా కన్నీళ్లు వచ్చాయి. అతను నన్ను కౌగిలించుకున్నాడు.అకస్మాత్తుగా నేను మేల్కొన్నాను అంటూ తేజ్ ప్రతాప్ చెప్పారు.
विश्व रूप दर्शन योग मैं मुकुट से सुशोभित चक्र और गदा से सुसज्जित शस्त्रों के साथ सर्वत्र दीप्तिमान लोक के रूप में आपके रूप को देख रहा हूँ। इस चमचमाती अग्नि में आपके तेज को देख पाना कठिन है जो सभी दिशाओं से प्रस्फुटित होने वाले सूर्य के प्रकाश की भांति है। pic.twitter.com/tqcrkKH5Qo
— Tej Pratap Yadav (@TejYadav14) March 22, 2023