Site icon Prime9

Enforcement Directorate (ED): రూ.263 కోట్ల మనీలాండరింగ్ కేసులో బిగ్ బాస్ బ్యూటీ కృతి వర్మ

Kriti Verma

Kriti Verma

Enforcement Directorate (ED):  263 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో బిగ్ బాస్ సీజన్ 12లో కనిపించిన కృతి వర్మ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారిస్తోంది.   కీలక నిందితులతో ఆమె సంబంధాలు కలిగి ఉన్నారనేది ఈడీ ఆరోపణ.

ఈ కేసులో వర్మను ఈడీ అధికారులు పలుమార్లు విచారణకు పిలిచారు.గత ఏడాది, పన్ను రీఫండ్‌లను మోసపూరితంగా జారీ చేసిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)  దర్యాప్తు చేసింది. డిపార్ట్‌మెంట్‌లోని సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, తానాజీ మండల్ అధికారి, పన్వేల్ కు చెందిన వ్యాపారి భూషణ్ అనంత్ పాటిల్‌మరియు ఇతరులపై కేసు నమోదు చేసింది.2007-08 మరియు 2008-09సంవత్సరాలకు అసెస్‌మెంట్ కు సంబంధించి బూటకపు రీఫండ్‌ల జారీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదయింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

ప్రధాన నిందితుడైన అధికారి, I-T డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు  ఈ నేరానికి పాల్పడ్డాడు.  భూషణ్ అనంత్ పాటిల్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాతో సహా వివిధ బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేయబడ్డాయి. అధికారి, పాటిల్, రాజేష్ శాంతారామ్ శెట్టి తదితరులపై ఐటీ చట్టం, 2000 కింద సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ఈడీ విచారణ..

నవంబర్ 15, 2019 మరియు నవంబర్ 4, 2020 మధ్య అధికారి ద్వారా 12 మోసపూరిత TDS రీఫండ్‌లు రూ. 263.95 కోట్లకు చేరాయని PMLA కింద జరిగిన దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఆదాయాలు పాటిల్ మరియు ఇతర సంబంధిత వ్యక్తులు మరియు సంస్థల బ్యాంకు ఖాతాలకు మరియు షెల్ కంపెనీలలోకి బదిలీ చేయబడ్డాయి.పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకల్లో రూ.69.65 కోట్ల విలువైన 32 స్థిర చర ఆస్తులను ఈడీ గత నెలలో అటాచ్ చేసింది.అటాచ్ చేసిన ఆస్తుల్లో భూషణ్ అనంత్ పాటిల్, రాజేష్ శెట్టి, సారిక శెట్టి, కృతి వర్మ తదితరుల పేరిట ఉన్న భూమి, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి.

కృతి వర్మ కు సంబంధం ఏమిటి ? (Enforcement Directorate (ED)

కృతి వర్మ హర్యానాలోని గురుగ్రామ్‌లో 2021లో సంపాదించిన ఒక ఆస్తిని విక్రయించారు. ఈ సొమ్ముతో  నిందితుల పేరుతో లోనావాలా, ఖండాలా, కర్జాత్, పూణే, ఉడిపి ప్రాంతాల్లో భూమి, పన్వెల్, ముంబై ప్రాంతాల్లో ఫ్లాట్లు, మూడు లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. వర్మకు నిందితులతో సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపించింది

కోల్‌కతా వ్యాపారవేత్త కార్యాలయంపై ఈడీ దాడులు..

కోల్‌కతాలోని ఓ వ్యాపారవేత్త కార్యాలయంలో బొగ్గు అక్రమ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.కోల్‌కతాకు చెందిన ఒక వ్యాపారవేత్త కార్యాలయంపై బుధవారం ఈడీ దాడులు నిర్వహించి అతడిని  తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

నిందితుడిని కోల్‌కతాలో ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్ షికారియాగా గుర్తించారు. అతను గజరాజ్ గ్రూప్ అనే నిర్మాణ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు.విక్రమ్ షికారియా కార్యాలయం నుంచి కోటి రూపాయలకు పైగా లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీవర్గాలు పేర్కొన్నాయి.కోల్‌కతాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ ప్రముఖులకు అతను సన్నిహితుడని తెలుస్తోంది. విక్రమ్ సన్నిహితుడయిన మరో వ్యాపారవేత్త మంజిత్ సింగ్ జిట్టా పరారీలో ఉన్నాడు .

ఇవి కూడా చదవండి:

Exit mobile version