Karnataka: భారత్ జోడో యాత్రను తలపెట్టిన కాంగ్రెస్ ను అడ్డుకొనేందుకు అధికార భాజాపా శ్రేణులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కేరళలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర 22వరోజుకు చేరుకొనింది. అక్టోబర్ 1న రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో ప్రవేశించనున్న నేపథ్యంలో స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లను భాజాపా శ్రేణులే చింపేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.
సమాచారం మేరకు, భారత జోడో యాత్రతో ప్రజల్లో హీరోగా మారిన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఏర్పాట్లను జరూ చేసింది. 1వ తేదీన పాదయాత్ర చామరాజనగర్ జిల్లా మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తమ నేత రాహుల్ గాంధీకి స్వాగతాలు పలికేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో గుండ్లుపేట ప్రాంతంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన పోస్టర్లను 40కి పైగా గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. ఇదంతగా భాజాపా శ్రేణుల పనేనంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది.
ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర కేరళలోని నిలంబూర్ నుండి ప్రారంభమై ముందుకు సాగుతుంది. కర్ణాటకలో భాజాపాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు భారత్ జోడో యాత్ర ఎంతో కీలకంగా మారింది. దీంతో ఏఐసిసి నేతలు సైతం కర్ణాటక పై ప్రత్యేక దృష్టి సారించారు. క్యాడర్ ను సమాయత్తం చేస్తూ దిశ నిర్ధేశం చేస్తున్న క్రమంలో పోస్టర్ల చించివేత వ్యవహారం రాజకీయ దుమారానికి తెరలేపిన్నట్లైయింది.
ఇది కూడా చదవండి: ఏపీలో మాకు తోడు జనసేనే.. ఎమ్మెల్సీ మాధవ్