Bengaluru Court: కర్ణాటక కేడర్ మహిళా అధికారుల రగడ చివరికి కోర్టుకు చేరింది. ఐఏఎస్ ఆఫీసర్ రోహిణీ సింధూరికి పరువు నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయొద్దని ఐజీపీ రూపా డి. మౌద్గిల్‌కు బెంగళూరు 74 వ సిటీ సివిల్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
రూప వివరణ ఇవ్వాలి: కోర్టు( Bengaluru Court)
రోహిణి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, ఆధార రహిత వార్తలు, ఇబ్బంది కలిగించే ఫొటోలను ప్రచురించకూడదని ప్రచార మాధ్యమాలను న్యాయస్థానం ఆదేశించింది.
ఇప్పటికే చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రూపా డి. మౌద్గిల్‌కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.
తనపై వ్యాఖ్యలు చేయకుండా రూపా డి. మౌద్గిల్‌ను నిరోధించాలని కోరుతూ ఐఏఎస్ ఆఫీసర్ రోహణి కోర్టును ఆశ్రయించారు.
తీవ్ర దుమారం రేపిన ఆరోపణలు
కాగా, ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ మధ్య వ్యక్తిగా ఫైట్ కర్ణాటకలో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఐఏఎస్ రోహిణీ సింధూరి వ్యక్తిగత చిత్రాలను బయట పెడుతూ ఐపీఎస్ రూపనా మౌద్గిల్ చేసి ఆరోపణలు దుమారం రేపాయి.
తన కటుంబాన్ని కాపాడుకునేందుకే తాను పోరాడుతున్నట్టు రూప తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. తనపై రూప ఆధారం లేని ఆరోపణలు చేస్తుందని లీగల్ నోటీసులు పంపారు సింధూరీ.
తన పరువుకు నష్టం కలిగించినందుకు రూప వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆరోపణలతో మానిసికంగా వేదన గురి చేసినందుకు రూ. కోటి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అదే విధంగా సింధూరిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను సైతం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టు విచారణను ఎదర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరినీ బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుంబా పెండింగ్ ఉంచారు.
ఇద్దరూ సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు చేసుకోవద్దని , బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ ఆదేశించారు.
కానీ, ప్రధాన కార్యదర్శి ఆదేశాల తర్వాత కూడా రూప మళ్లీ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ‘ నా కుటుంబం విఛ్చిన్నం కాకుండా పోరాడుతున్నా.. నేను, నా భర్త ఇప్పటికే కలిసే ఉన్నాం.
పలువురు జీవితాలు నాశనం అయ్యేందకు కారణమైన మహిళను నిలదీయక తప్పలేదు’ అంటూ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలోనే సింధూరీ కోర్టును ఆశ్రయించింది. తనపై రూప చేస్తున్న ఆరోపణలను ఆపాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.