Site icon Prime9

CM Mamata Banerjee: దుర్గా పూజ కమిటీలకు ఒక్కొక్కదానికి రూ.60,000 మంజూరు.. మమతా బెనర్జీ

West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 43,000 దుర్గా పూజ కమిటీలకు ఒక్కొక్కదానికి రూ.60,000 ప్రకటించారు. అయితే ప్రకటన వెలువడిన వెంటనే ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు పిల్‌లు దాఖలయ్యాయి.

ప్రభుత్వం ఆర్దిక సాయం మంజూరును ఉపసంహరించుకోవాలని పిటిషనర్ సుబీర్ కుమార్ ఘోష్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే బుధ, గురువారాల్లో మరో పిల్‌ నమోదైంది. కోర్టు ఆదేశాలను అనుసరించి ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) చెల్లించకుండా పూజలకు ఎందుకు విరాళాలు ఇస్తున్నారనే ప్రశ్న తలెత్తింది. కరెంటు బిల్లులో రాయితీ ఎందుకు ఇస్తారని న్యాయవాది ప్రశ్నించారు. ఈ కేసు విచారణ శుక్రవారం జరిగే అవకాశం ఉంది. చాలా మందికి ఇప్పటికీ ఆహారం, స్వచ్ఛమైన నీరు, విద్యుత్ మరియు మందులు లభించని చోట, విరాళం విలాసవంతమైనదని కూడా పిల్‌లో పేర్కొన్నారు.

ఆగస్టు 22న నేతాజీ ఇండోర్ స్టేడియంలో పూజా నిర్వాహకులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి ఈ ఏడాది పూజల సందర్భంగా విద్యుత్ బిల్లు పై రాయితీ ఉంటుందని చెప్పారు. పూజా కమిటీలకు బిల్లులపై 60 శాతం రాయితీ ఇవ్వాలని కోల్‌కతా, రాష్ట్ర విద్యుత్ బోర్డులను అభ్యర్థించారు. ఈసారి దుర్గాపూజ యునెస్కోచే వారసత్వ ప్రదేశంగా జాబితా చేయబడింది.

Exit mobile version