Site icon Prime9

Bayron Biswas: పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఖాళీ.. తృణమూల్ గూటికి చేరిన ఏకైక ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్

bemgal

bemgal

Bayron Biswas: పశ్చిమ బెంగాల్‌లో సాగర్‌డిఘి అసెంబ్లీ స్దానానికి  ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మూడు నెలల ఊహాగానాల తర్వాత, పుర్బా మేదినీపూర్‌లోని ఘటోలాలో సోమవారం జరిగిన వేడుకలో ఆయన అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ఆధ్వర్యంలో బేరాన్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. బేరాన్ శాసనసభలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనితో అతనికి ఫిరాయింపు నిరోధక చట్టం నుండి మినహాయింపు వచ్చింది.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ రాలేదు..(Bayron Biswas)

2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. సాగర్‌డిఘి స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో, కాంగ్రెస్ వామపక్షాలతో సహా ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసింది.తృణమూల్‌కు చెందిన దేబాశిష్ బెనర్జీపై 22,000 ఓట్ల తేడాతో బిశ్వాస్ విజయం సాధించారు. బిశ్వాస్ పార్టీలో చేరిన సందర్బంగా టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్‌లో బీజేపీతో పోరాడే ఏకైక శక్తి టీఎంసీ మాత్రమేనని భావించిన బేరాన్ బిస్వాస్ మాతో చేరారు అని అన్నారు.

ఈరోజు, శ్రీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో కొనసాగుతున్న జోనోసంజోగయాత్రలో, సాగర్దిఘి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ మాతో చేరారు. మేము ఆయనను తృణమూల్ కాంగ్రెస్ కుటుంబానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము! బీజేపీ విభజన మరియు వివక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలనే మీ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి, మీరు సరైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకున్నారు. కలిసి, మనం గెలుస్తాము!” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పేర్కొంది.

 

Exit mobile version