Bank Holidays: ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే ఏప్రిల్ లో చాలా రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిస్ట్ విడుదల చేసింది. ఆ లిస్ట్ ప్రకారం ఏప్రిల్ నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకు సెలవులున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా కలిసి ఉన్నాయి. దాదాపు ఏప్రిల్ నెలలో బ్యాంకులు సగం రోజులు సెలవుల్లోనే ఉంటాయి. అయితే ఆన్లైన్ సేవలు, యూపీఐ లావాదేవీలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదు.
ఏప్రిల్ 1- కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు(మిజోరం, చండీగఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా)
ఏప్రిల్ 2, 9,16,23,30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు
ఏప్రిల్ 4 – మహావీర్ జయంతిని పురస్కరించుకుని వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి
ఏప్రిల్ 5 – బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7- గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 8- రెండో శనివారం, అలాగే 22 నాలుగో శనివారం, ఈద్
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 15- విషు, బోహాగ్ బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తల, గువాహతి, కోచి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 18- షాబ్ ఇ బకర్ కారణంగా జుమ్మూ , శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 21- రంజాన్ ఈద్( ఈద్ ఉల్ ఫితర్) అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
RBI, బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. ‘హాలిడేస్ అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్’, ‘రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్’ & ‘క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్’. ఏ బ్యాంక్ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATM ని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐని ఉపయోగించవచ్చు.