Site icon Prime9

Onion Export: వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతిపై నిషేధం

onion export

onion export

Onion Export:కేంద్రం మార్చి 31, 2024 వరకు ఉల్లిపాయల అ ఎగుమతులపై ఆంక్షలను పొడిగించింది. .ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర (MEP)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడం, దేశీయ మారకెట్లో ధరల లభ్యతను పెంచడం లక్ష్యంగా లక్ష్యంగా ఈ చర్యను తీసుకుంది.

ఉల్లిపాయలపై ఎగుమతి పన్ను..(Onion Export)

గత ఏడాది కాలంలో ఉల్లి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి.ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఉల్లి యొక్క ఆల్-ఇండియా రిటైల్ ధర కిలోగ్రాముకు రూ. 57.85కి పెరిగింది.అక్టోబర్‌, నవంబర్‌లో ఉల్లిపాయలు మరియు టమోటాల ధరలు వరుసగా 58% మరియు 35% పెరిగాయి, పండుగల డిమాండ్ మరియు ఖరీఫ్ సీజన్‌లో అస్థిర వర్షపాత పరిస్థితులు, తక్కువ ఉత్పత్తి కారణంగా వీటి ధరలు పెరిగాయి.ప్రభుత్వం ఆగస్టులో ఉల్లిపై 40% ఎగుమతి సుంకం విధించింది. అది ఎగుమతులను గణనీయంగా తగ్గించడంలో సహాయపడలేదు. దీనితో ప్రభుత్వం దానిని రద్దు చేసి ఉల్లిపాయలపై కనీస ఎగుమతి ధర $800 గా విధించింది.ఈ సంవత్సరం, ఈజిప్ట్ మరియు టర్కీ వంటి ప్రధాన ఉల్లి ఎగుమతిదారులు ఉల్లి ఎగుమతులను నిషేధించారు. పాకిస్థాన్‌లో ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉండగా, హాలండ్ కూడా దిగుమతులకు శ్రీకారం చుట్టింది.భారత ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతి పై నిషేధాల కారణంగా ఎగుమతి మార్కెట్లలో భారతదేశం యొక్క భాగం బాగా తగ్గిపోయింది. కొన్ని దేశాలలో 80% నుండి కనిష్టంగా 30%కి పడిపోయింది.

Exit mobile version