Amit Shah : అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సిద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిం చారు. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ ఎన్నో ఆటంకాలు తలపెట్టిందని, కోర్టుల్లో మందిరానికి ఆటంకంగా నిలిచిందని ఆయన ఆరోపించారు. గురువారం త్రిపురలోని సబ్రూంలో ఎన్నికల సభలో ప్రసంగిం చిన ఆయన కాంగ్రెస్, సీపీఎం కలిసి అయోధ్యలో రామాలయ నిర్మా ణాన్ని దశాబ్దాల పాటు కోర్టుల్లో నానేటట్లు చేశాయన్నారు.
కోర్టుల్లో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ ఎన్నో అడ్డంకులు సృష్టించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాతే ఒక రోజు సుప్రీంకోర్టు రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు మీరంతా జాగ్రత్తగా వినండి. 2024 జనవరి 1వ తేదీన రామ మందిర ఆలయం సిద్దం అవుతుందని అమిత్ షా తెలిపారు.
మరోవైపు అమిత్ షా ప్రకటన 2024 ఎన్నికల ప్రచారంలో భాగమే అని అని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. రామాలయ నిర్మాణం జనవరి 1కి పూర్తవడం సంతోషకరమైన విషయమే అయినా దాని నుంచి బీజేపీ లబ్ధి పొందే ప్రయత్నం చేయడం సరికా దని తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతాయ్ అన్నారు. రాముడు బీజేపీ ఆస్తికాదని, అందరివాడని వ్యాఖ్యానించారు.