Site icon Prime9

Ram Gopal Yadav: అయోధ్య రామందిరం పనికిరానిది.. సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్

Ram Gopal Yadav

Ram Gopal Yadav

Ram Gopal Yadav:సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరాన్ని పనికిరానిదిగా వ్యాఖ్యానించారు. రామ మందిరం వాస్తు ప్రకారం నిర్మించబడలేదని ఆయన అన్నారు.నేను ప్రతిరోజూ రాముడిని పూజిస్తాను. రామనవమిపై కొంత మంది పేటెంట్ చేశారు. అయోధ్యలోని రామ మందిరం వాస్తు ప్రకారం సరిగా లేదని అన్నారు.

ప్రజల విశ్వాసంతో ఆటలు..(Ram Gopal Yadav)

ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ప్రజల విశ్వాసంతో ఇండియా కూటమి ఆడుతోందన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని వారు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వినాశ కాలే విప్రీత్ బుద్ధి. రామ్ గోపాల్ యాదవ్ ఏం మాట్లాడినా అది సనాతన్ విశ్వాసాలను అవమానించడమేనని యోగి అన్నారు.రామ్ గోపాల్ యాదవ్ వ్యాఖ్యలు రామమందిరాన్ని అవమానపరిచేటట్లు ఉన్నాయని బీజేపీ పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇలా రాసారు. రామ మందిరంపై రామ్ గోపాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమైనమి.. అత్యంత అవమానకరమైనవి. రామభక్తులపై సమాజ్‌వాదీ పార్టీ దాడి చేస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలతో సనాతన ధర్మ నిర్మూలనకు ఇండియా కూటమి కృషి చేస్తోంది. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది కూడా రామ్ గోపాల్ యాదవ్ వ్యాఖ్యలను ఖండించారు. ఘజియాబాద్‌లోని హజ్ హౌస్ వారికి మంచిది, అయితే రామమందిరం వారికి పనికిరానిది. ఆగ్రా మొఘల్ గార్డెన్ బాగుంటుంది. రామమందిరం పనికిరానిది. ఇండియా కూటమి మాట్లాడాలి. మళ్లీ రామమందిరానికి తాళం వేయాలనుకుంటున్నారా? అంటూ ప్రవ్నించారు.

Exit mobile version