Ayodhya Ram Temple: భారీ వర్షాలు కురవడంతో అయోద్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు కారుతోందని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఆలయ ప్రాంగణంలోని వర్షపు నీరు బయటకు పోయేలా ఏర్పాటు చేయలేదని అన్నారు. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను కోరారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామమందిరాన్ని నిర్మిస్తుండగా ఇది జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది.. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించారు. కానీ, వర్షం పడితే పైకప్పు లీక్ అవుతుందని ఎవరికీ తెలియదు.. ఇది ప్రపంచ-ప్రసిద్ధ దేవాలయం ఎందుకు ఇలా జరిగిందంటూ ఆయన ప్రశ్నించారు.ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా తప్పు అని అన్నారు..రామ్ లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం మరియు విఐపి దర్శనం కోసం ప్రజలు వచ్చే ప్రదేశం నుండి నేరుగా పైకప్పు నుండి వర్షపు నీరు కారుతోంది.మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకుని పైకప్పుకు మరమ్మతులు చేసి వాటర్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దాలని ఆదేశాలు ఇచ్చారు. వర్షపు నీరు లీకేజీకి నిర్మాణ పనులే కారణమని తెలిపారు. మొదటి అంతస్తులో పనులు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు
శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఇక్కడి రాంపత్ రోడ్డు, దాని పక్కనే ఉన్న మార్గాల్లో నీరు నిలిచిపోయింది. మురుగు నీరు ఆ ప్రాంతంలోని ఇళ్లలోకి ప్రవేశించగా, అయోధ్యలో రాంపత్ రోడ్డు మరియు ఇతర కొత్తగా నిర్మించిన రోడ్లు కొన్ని చోట్ల ధ్వంసమయ్యాయి.