Prime9

Air India : ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృత్యుంజయుడు.. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుడు

Air India Plane Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కళాశాల భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. లండన్‌ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 242 మందితో సహా గుజరాత్ మాజీ విజయ్ రూపానీ మృతిచెందారు.

 

మృత్యుంజయుడు..
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత ప్రయాణికుడు బయటకు నడిచివచ్చాడు. గాయాలతో 38 ఏళ్ల రమేశ్ విశ్వాస్ కుమార్ గాయాలతో బయట పడినట్లు అధికారులు గుర్తించారు. 11ఏ సీటులోని రమేశ్ కూర్చున్నాడు. ప్రమాదం అంతా క్షణాల్లో జరిగిందని అతడు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే లేచి పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. అక్కడే అన్నీ మృతదేహాలు పడి ఉన్నాయని పేర్కొన్నారు. తనతోపాటు నా సోదురుడు కూడా ప్రయాణిస్తున్నాడని, అతడు కనిపించలేదని చెప్పారు. రమేశ్ గాయాలతో బయట పడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar