Site icon Prime9

Sachin Pilot: అశోక్ గెహ్లాట్ కు లీడర్ సోనియా కాదు.. వసుంధరా రాజే.. రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్

Sachin Pilot

Sachin Pilot

Sachin Pilot:  రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అవినీతి సమస్యలను లేవనెత్తడానికి మే 11న అజ్మీర్ నుండి జైపూర్ వరకు ‘జన్ సంఘర్ష్ యాత్ర’ను మంగళవారం ప్రకటించారు. ఈ సందర్బంగా పైలట్ మాట్లాడుతూ ధోల్‌పూర్‌లో అశోక్ గెహ్లాట్ ప్రసంగం విన్న తర్వాత ఆయన నాయకురాలు సోనియా గాంధీ కాదని, వసుంధర రాజే అని అనిపిస్తోందని అన్నారు.

బీజేపీ నేతలు సహకరించారు.. (Sachin Pilot)

మొదటిసారిగా, ఎవరైనా తమ సొంత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను విమర్శించడం చూస్తున్నాను. బీజేపీ నేతలను పొగిడడం, కాంగ్రెస్ నేతలను అప్రతిష్టపాలు చేయడం నాకు అర్దం కావడం లేదు. ఇది పూర్తిగా తప్పు అని గెహ్లాట్ ప్రకటనపై సచిన్ పైలట్ స్పందిస్తూ అన్నారు.2020లో పైలట్ తనపై కాంగ్రెస్ శాసనసభ్యుల తిరుగుబాటుకు నాయకత్వం వహించినప్పుడు వసుంధరా రాజే మరియు మరో ఇద్దరు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు, మాజీ అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘవాల్ మరియు శాసనసభ్యురాలు శోభారాణి కుష్వా తన ప్రభుత్వాన్ని రక్షించడంలో సహాయపడ్డారని గెహ్లాట్ తన ప్రసంగంలో చెప్పారు.తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై గెహ్లాట్ సెటైర్లు వేసారు. వారు బీజేపీ నుండి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని అలా చేస్తే ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ బాధ్యతను నిర్వర్తించవచ్చని అన్నారు.

గెహ్లాట్ ప్రశంసలు  పెద్ద కుట్ర ..

ఇదిలా ఉంటే, గెహ్లాట్ ప్రకటనపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే స్పందిస్తూ గెహ్లాట్ ‘ప్రశంసలు  పెద్ద కుట్ర అని తన పార్టీలో తిరుగుబాటు కారణంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు.సచిన్ పైలట్ మరియు 18 మంది ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెహ్లాట్ నాయకత్వంపై జూలై 2020లో తిరుగుబాటు చేశారు.పార్టీ హైకమాండ్ జోక్యంతో నెల రోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడింది.ఆ తర్వాత పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తొలగించారు.

Exit mobile version