MGNREGA: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది . ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలబడింది.
45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించింది . తెలంగాణ లో మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయని గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. అదే విధంగా ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో , రాజస్థాన్ నాలుగవ స్థానంలో , బిహార్ ఐదవ స్థానంలో నిలబడ్డాయి.కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేసి ఈ పథకానికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అని పేరుపెట్టింది కాల క్రమంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గా మార్చారు . 25 ఆగస్టు, 2005 ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ లోని అనంత పురం జిల్లాలో ప్రారంభించారు .ఈ పథకం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 125 పని దినములు, కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.