Site icon Prime9

G20 summit: G20 సదస్సుకు యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, 130,000 మంది భద్రతా అధికారులు

G20 summit

G20 summit

G20 summit:సెప్టెంబరు 9 మరియు 10 తేదీలలో న్యూ ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సందర్శించే ప్రతినిధులకు రక్షణగా 130,000 మంది భద్రతా అధికారులను విధుల్లో నియమించారు. సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల సమ్మిట్‌లో యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ నుండి బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ మరియు సౌదీ అరేబియాకు చెందిన మహ్మద్ బిన్ సల్మాన్ వరకు అతిధులు వస్తున్నారు. అయితే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

80,000 మంది ఢిల్లీ పోలీసులు..(G20 summit)

ప్రగతి మైదాన్‌లో జరిగే ఈవెంట్‌కు మరో ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ రణవీర్ సింగ్ కృష్ణ ఆధ్వర్యంలోని బృందం రక్షణగా ఉంటుంది. నగరంలో భద్రతా ఏర్పాట్లకు బాధ్యత వహిస్తున్న ఢిల్లీ పోలీసు ప్రత్యేక కమిషనర్ దేవేంద్ర పాఠక్ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మకమైన, చిరస్మరణీయమైన క్షణం. కనీసం 80,000 మంది ఢిల్లీ పోలీసులకు భద్రతా ఏర్పాట్ల బాధ్యతను కూడా అప్పగించారు. ఢిల్లీ నగరానికి ప్రవేశం నియంత్రించబడుతుందని అధికారులు తెలిపారు. 20 మిలియన్ల జనాభా ఉన్న నగరంలో, పాఠశాలలు, ప్రభుత్వ విభాగాలు మరియు వ్యాపారాలను మూడు రోజుల పాటు మూసివేయాలని కోరారు..భూమిపైనే కాదు, ఆకాశంలో కూడా నిఘా ఉంటుంది. భారత వైమానిక దళం ప్రతినిధి ఢిల్లీ మరియు సమీప ప్రాంతాలలో సమగ్ర ఏరోస్పేస్ రక్షణ కోసం సమగ్ర చర్యలను మోహరిస్తామని చెప్పారు. వైమానిక దళంతోపాటు భారత సైన్యం, ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలతో పాటు ఎలాంటి వైమానిక ముప్పులు తలెత్తకుండా ఉండేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరిస్తామని అధికార ప్రతినిధి తెలిపారు. సుమారు 400 మంది అగ్నిమాపక సిబ్బంది సిద్దంగాద ఉంటారు. వేదిక వద్ద సెక్యూరిటీ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడంతోపాటు జోబైడెన్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్ వంటి కీలక హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి జులైలో ప్రధాని మోదీ రాజధానిలో $ 300 మిలియన్ల వేదికను ప్రారంభించారు. ఇక్కడ 3,000 కంటే ఎక్కువ మంది కూర్చునే అవకాశముంది. సదస్సుకు హాజరయే నేతలను తరలించడానికి $2.18 మిలియన్లు ఖర్చుతో ప్రభుత్వం 20 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను లీజుకు తీసుకుంది. చాలా మంది ప్రపంచ నాయకులు తమ సొంత అంగరక్షకులు మరియు వాహనాలతో ప్రయాణిస్తారు. అమెరికా 20కి పైగా విమానాలను తీసుకువస్తోందని ఒక అధికారి తెలిపారు.

 

Exit mobile version