Site icon Prime9

Pahalgam Terror Attack: మరో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత.. పిర్‌పంజాల్ అడవుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులు!

nother Terrorists' houses Bombed in Crackdown After Pahalgam Terrorist Attack

nother Terrorists' houses Bombed in Crackdown After Pahalgam Terrorist Attack

Another Terrorists’ houses Bombed in Crackdown After Pahalgam Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్ ముమ్మర చర్యలు చేపట్టింది. తాజాగా, మరో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసింది. దీంతో గత మూడు రోజుల్లో 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసింది. ఇందులో భాగంగానే ఉగ్రవాది అద్నాన్ షఫీ ఇల్లు కూల్చివేసింది. షోఫియాన్ జిల్లాలో షఫీ ఇంటిని భద్రతా బలగాలు కూల్చివేశాయి. షఫీ.. ఏడాది నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉంటున్నాడు.

 

అదే విధంగా అద్నాన్ షఫీతో పాటు ఫరూక్ అహ్మద్ తద్వా, జమీల్ అహ్మద్ షీర్ అమీర్ నాజిర్, జాకీర్ అహ్మద్ ఇళ్లను కూల్చేసింది. దీంతో 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేశామని ప్రకటించింది. అలాగే మిగతా ఉగ్రవాదులపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శ్రీనగర్‌లో ఉగ్రవాదుల స్థావరాను గుర్తించేందుకు 60కిపైగా ప్రాంతాల్లో జల్లెడ పట్టింది.

 

మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టింది. పిర్‌పంజాల్ అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటకే ఉగ్రవాదులకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించారు. ఇందులో ఏకే47 గన్స్, తూటాలు, పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

Exit mobile version
Skip to toolbar