Site icon Prime9

Manipur Gang Rape: మణిపూర్ లో వెలుగుచూసిన మరో గ్యాంగ్ రేప్ కేసు

12 years minor-girl-molestation in orissa

12 years minor-girl-molestation in orissa

Manipur Gang Rape:మణిపూర్‌లో మరో సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మే 3న జాతి ఘర్షణలు చెలరేగడంతో చురాచంద్‌పూర్‌లోని తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా తనపై కుకీ వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 37 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసారు.

దాడిచేసి లైంగిక వేధింపులు..(Manipur Gang Rape)

పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, మే 3న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కుకీ దుండగుల బృందం ఆ మహిళ నివాసంతో సహా పలు ఇళ్లకు నిప్పుపెట్టింది. గందరగోళం మధ్య, ఆమె తన మేనకోడలు మరియు ఇద్దరు కుమారులు, తన కోడలుతో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే దాదాపు అర కిలోమీటరు దూరం పరుగెత్తడంతో ఆమె అదుపుతప్పి కిందపడింది. ఆమె కోడలు పిల్లలతో సురక్షితంగా పరిగెత్తుతుండగా ఆరుగురు దుర్మార్గులు ఆ మహిళను అడ్డుకున్నారు.ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమెపై శారీరకంగా దాడి చేసి, క్రూరమైన లైంగిక వేధింపులకు గురిచేసారు.

నేను ఏడ్చినప్పటికీ ఎవరి నుండి సహాయం లేదు. ఆ తర్వాత, మరికొందరు కుకీ దుర్మార్గులు మళ్లీ వారితో చేరారు. ఆ సమయంలో, నేను స్పృహ కోల్పోయాను. తరువాత, నేను స్పృహలోకి వచ్చాక, కొంతమంది మైటీ వ్యక్తులు తన చుట్టూ ఉన్నట్లు మహిళ తన ప్రకటనలో పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ మహిళ ఇప్పుడు అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వారి కోసం సహాయక శిబిరంలో నివసిస్తోంది.

Exit mobile version