Site icon Prime9

Viral Video: ఊహించని ప్రమాదం.. స్నేహితుల కళ్ల ముందే చనిపోయాడు

viral video

viral video

Viral Video: మృత్యువు ఏ దారి నుంచి ఎలా వస్తుందో.. ఎప్పుడో వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు ఏం జరిగిందో అని అర్ధమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. ఇలాంటి ఊహించని ప్రమాదాలు.. ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఓ షాకింగ్ ఘటనే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా Viral Video మారింది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడు. ఈ ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది.

రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ప్రమాదవ శాత్తు 6వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. కళ్లముందే తమ స్నేహితుడు చనిపోవడం చూసి వారు షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో.. నెట్టింట్లో వైరల్ గా మారింది. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇషాంషు భట్టాచార్య అనే విద్యార్థి నీట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇక్కడే వసతి గృహంలో ఉంటూ.. కోచింగ్ కు వెళ్తున్నాడు. ఇదే హాస్టల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఒక్కసారిగా ఆరు అంతస్థుల నుంచి పడటంతో.. ఆ విద్యార్ధి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే స్నేహితుడి మృతి చెందడం తోటి విద్యార్ధులను తీవ్రంగా కలచివేసింది.

 

మృతి చెందిన విద్యార్థి..ఆగస్టులో రాజస్తాన్ (Rajasthan) కు వచ్చి చదువు కుంటున్నాడు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ కు ప్రిపేర్ అవుతున్నాడు.

స్నేహితులతో కలిసి భట్టాచార్య వసతి గృహంలో ఉంటున్నాడు.

తన ముగ్గురు స్నేహితులతో కలిసి అతడు.. బిల్డింగ్ 6వ అంతస్తు బాల్కనీలో ముచ్చట్లు పెట్టాడు. నలుగురూ చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నారు.

నవ్వుకున్నారు. హ్యాపీగా గడిపారు. అర్థరాత్రి దాటాక రూమ్ కి వెళ్లేందుకు అంతా లేచారు.

భట్టాచార్య తన కాళ్లకు చెప్పులు వేసుకునే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ఆ విద్యార్ధి బ్యాలెన్స్ కోసం తన వెనుకున్న రెయిలింగ్ ని ఆనుకున్నాడు. రెయిలింగ్ ని ఆనుకునే క్రమంలో.. అదుపు తప్పాడు.

రెయిలింగ్ పై పడటంతో.. ఊడిపోయింది. దీంతో 6వ అంతస్తు నుంచి అమాంతం కింద పడి చనిపోయాడు.

ఈ ఘటన మెుత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కళ్ల ముందే స్నేహితుడు చనిపోవడం చూసి స్నేహితులు షాక్ కి గురయ్యారు.

ఆ బాల్కనీ రెయిలింగ్ వీక్ గా ఉందని.. ముందే గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు.

దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు కోరారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version