Site icon Prime9

Amitabh Bachchan: అయోధ్యలో భూమిని కొన్న అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan

Amitabh Bachchan

 Amitabh Bachchan: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవలే అయోధ్యలో స్థలాన్ని కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) ద్వారా అయోధ్యలోని 7-స్టార్ మిక్స్డ్ యూజ్ ఎన్‌క్లేవ్ అయిన ది సరయులో అమితాబ్ ఈ స్దలాన్ని కొన్నారు.

భావోద్వేగ సంబంధం..( Amitabh Bachchan)

అమితాబ్ కొనుగోలు చేసిన ఆస్తి 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని మరియు దాని విలువ రూ. 14.5 కోట్లు అని రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అమితాబ్ స్దలం కొనుగోలు చేసిన విషయాన్ని తెలిపారు. సరయు ప్రాజెక్టు 51 ఎకరాల్లో విస్తరించి ఉంది. నేను నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న అయోధ్యలోని సరయు కోసం అభినందన్ లోధా హౌస్‌తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నాను. అయోధ్య కాలాతీతమైన ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సంపద భౌగోళిక సరిహద్దులను దాటి భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఇది అయోధ్య యొక్క ఆత్మలోకి హృదయపూర్వక ప్రయాణం ప్రారంభం, ఇక్కడ సంప్రదాయం మరియు ఆధునికత సజావుగా సహజీవనం చేస్తూ, నాతో లోతుగా ప్రతిధ్వనించే ఒక భావోద్వేగ చిత్రణను సృష్టిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో నా ఇంటిని నిర్మించడానికి నేను ఎదురు చూస్తున్నాను అని అమితాబ్ చెప్పారు.

ఈ స్దలం అయోధ్య రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల దూరంలో ఉంది. ఇలా ఉండగా రామమందిరం ప్రారంభోత్సవానికి మూడువేలమందికి పైగా వీవీఐపీలు హాజరవుతున్నారు. వీరిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నటి కంగనా రనౌత్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురువు రామ్‌దేవ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ రతన్ టాటా, గౌతమ్ అదానీ. తదితరులు ఉన్నారు.

 

Exit mobile version
Skip to toolbar