Site icon Prime9

Gnanavapi Masjid survey: జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

Gnanavapi Masjid

Gnanavapi Masjid survey: జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంజుమన్ ఇంతెజామియా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయనుంది.

సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగకూడదు..(Gnanavapi Masjid survey)

అలహాబాద్ హైకోర్టు గురువారం ముస్లింల అభ్యర్థనను తిరస్కరించింది. సర్వే కొనసాగించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. సర్వే నిర్వహించాలని ఆదేశించిన వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు జూలై 27న తీర్పును రిజర్వ్ చేసింది. మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా మసీదు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు తన తీర్పులో న్యాయం కోసం శాస్త్రీయ సర్వే అవసరమని తెలిపింది. పిటిషన్‌ను గురువారం కొట్టివేసిన హైకోర్టు, సర్వే వల్ల నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకూడదని పేర్కొంది. సర్వేలో భాగంగా మసీదులో ఎలాంటి తవ్వకాలు జరపకూడదని తేల్చి చెప్పింది.

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తీర్పును స్వాగతిస్తూ.. ఈ తీర్పును స్వాగతిస్తున్నానని.. ఏఎస్‌ఐ సర్వే, జ్ఞాన్‌వాపీ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.జులై 21న, వారణాసి కోర్టు పురావస్తు శాఖ (ASI)ని , అవసరమైన చోట త్రవ్వకాలతో సహా సర్వే నిర్వహించాలని ఆదేశించింది. మసీదు యొక్క ‘వజుఖానా’, హిందూ న్యాయవాదులు ‘శివలింగం’గా పేర్కొంటున్న నిర్మాణం ఉనికిలో ఉంది. ఈ ప్రదేశంలో అంతకుముందు ఒక దేవాలయం ఉండేదని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 17వ శతాబ్దంలో దానిని కూల్చివేశారని హిందూ కార్యకర్తలు పేర్కొన్నారు.

Exit mobile version