Prime9

Rahul Gandhi : రాహుల్‌ గాంధీపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం

Allahabad High Court angry with Rahul Gandhi : కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో భారత ఆర్మీని ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్‌కు చురకలు అంటించింది. సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు లేదని కోర్టు పేర్కొంది.

 

రాహుల్‌ గాంధీ దేశంలో భారత జోడో యాత్ర చేపట్టారు. దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని, కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న వారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగలరా? అని ప్రశ్నించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని, దీని గురించి దేశ మీడియా ప్రశ్నించడం లేదన్నారు. ఇది నిజం కాదా..? ఇదంతా యావత్ దేశం గమనిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

 

రాహుల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు కల్పించిందని కోర్టు తెలిపింది. అందులో ఎలాంటి సందేహం లేదని, కానీ, వాక్‌ స్వాతంత్య్రానికి కొన్ని పరిమితులు ఉన్నాయని, సైనికులను కించపరిచే హక్కు లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version
Skip to toolbar