Site icon Prime9

Ajit Pawar: పోలీసు డిపార్టుమెంట్ భూమిని ఆమ్మేసిన అజిత్ పవార్.. మాజీ పోలీసు అధికారి ఆరోపణలు

Ajit Pawar

Ajit Pawar

Ajit Pawar:  పూణేలోని ఎరవాడలో పోలీసులకు చెందిన 3 ఎకరాల భూమిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 2010లో వేలం వేసినట్లు పూణే మాజీ పోలీసు కమిషనర్ మీరన్ చద్దా బోర్వాంకర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ద్వారా 2జి స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న బిడ్డర్‌కు ఈ భూమిని విక్రయించారని తెలిపారు.

హోం మంత్రి కూడా అడ్డుకోలేకపోయారు..(Ajit Pawar)

‘మేడమ్ కమీషనర్’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. , అప్పటి పూణే జిల్లా ఇన్ చార్జి మంత్రి అజిత్ పవార్ (పేరు ప్రస్తావించలేదు) భూమిని ప్రైవేట్ పార్టీకి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారని, ఆ తర్వాత చాలా పోరాటం చేసిన తర్వాత ఈ భూమిని తిరిగి పొందగలిగామని బోర్వాంకర్ వెల్లడించారు. అప్పటి మహారాష్ట్ర హోం మంత్రి ఆర్‌ఆర్ పాటిల్‌తో తనకు మంచి రిలేషన్ ఉండేదని అయితే ఆయన కూడా వేలాన్ని ఆపలేకపోయారని ఆమె పేర్కొన్నారు. ఈ వేలం పోలీసు శాఖకు విరుద్ధమని, భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంలో ఖచ్చితంగా కుంభకోనం ఉందని ఆ పుస్తకంలో బోర్వంకర్ వెల్లడించారు. అజిత్ పవార్ మాటకు ఎదురు చెప్పే సాహసం అధికారులు కాని, మీడియా కాని చేయరని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు తన పుస్తకంలో ఆమె పేర్కొన్నారు. భూమిని అప్పగించమని బోర్వాంకర్‌ని అజిత్ పవార్ పిలిపించినప్పుడు, అది పోలీసు వినియోగానికి మరియు పోలీసు సిబ్బంది నివాసానికి అవసరమని భావించినందున ఆమె నిరాకరించింది. కోర్టులో, మహారాష్ట్ర హోం శాఖ ఒప్పందాన్ని వ్యతిరేకించడానికి నిరాకరించింది, అయితే పోలీసు శాఖ ఒప్పందానికి వ్యతిరేకంగా ఉంది. దీనితో తరువాత మంత్రి అజిత్ పవార్ తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నారని బోర్వాంకర్ తెలిపారు. రెండేళ్ల తరువాత పూణేలో సీఐడీ అదనపు డైరక్టర్ జనరల్ పోస్టును కోరగా ఇవ్వడానికి నిరాకరించారని చెప్పారు.

బోర్వాంకర్ పుస్తకంలో చేసిన ఆరోపణలను అజిత్ పవార్ కార్యాలయం ఖండించింది. అజిత్ పవార్ కు సదరు భూమితో ఎటువంటి సంబంధం లేదని అతని కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా, బోర్వాంకర్ పుస్తకంలో అజిత్ పవార్ పేరును ప్రస్తావించలేదు, కానీ అతనిని ‘జిల్లా మంత్రి’ లేదా ‘దాదా’ అని మాత్రమే సూచించారని పేర్కొంది. బోర్వాకంర్ పుస్తకం మేడమ్ కమీషనర్ ఆదివారం విడుదలయింది.

Exit mobile version
Skip to toolbar