Site icon Prime9

Air India flight: సౌదీ అరేబియా వెళ్లవలసిన విమానం త్రివేండ్రం వైపు మళ్లించారు.. ఎందుకంటే..

Air India flight

Air India flight

Air India flight:  168 మంది ప్రయాణికులతో కాలికట్ నుండి సౌదీ అరేబియాలోని దమ్మామ్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX385)  శుక్రవారం తిరువనంతపురం వైపు మళ్లించబడింది. సాంకేతిక లోపం కారణంగానే విమానాన్ని దారి మళ్లించామని ఎయిర్‌లైన్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

168 మంది ప్రయాణికులతో కాలికట్ నుండి సౌదీ అరేబియాలోని దమ్మామ్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక సమస్యల కారణంగా తిరువనంతపురం వైపు మళ్లించబడింది” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన ప్రకటనలో తెలిపింది.

స్వీడన్ లో అత్యవసరంగా ల్యాండయిన విమానం..(Air India flight)

ఎయిర్ ఇండియాకు చెందిన న్యూయార్క్ (యుఎస్)-ఢిల్లీ ఫ్లైట్ (AI106) మూడు వందల మంది ప్రయాణికులతో బుధవారం నాడు స్వీడన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.విమానం ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)తెలిపింది.ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.విమానం స్టాక్‌హోమ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని సీనియర్ డీజీసీఏ అధికారి తెలిపారు. విమానాన్ని తనిఖీ చేయగా, ఇంజన్ నంబర్ టూలోని డ్రెయిన్ మాస్ట్ నుంచి చమురు ప్రవహిస్తున్నట్లు కనిపించిందని ఆయన చెప్పారు.

లండన్ కు మళ్లించిన విమానం..

లండన్ కు మళ్లిన విమానం..ఒక ప్రయాణికుడు ఆరోగ్య సమస్యల గురించి ఫిర్యాదు వచ్చింది.దీనితో  ఇండియా యొక్క న్యూయార్క్-ఢిల్లీ విమానాన్ని సోమవారం లండన్‌కు మళ్లించారు.న్యూయార్క్ నుండి న్యూ ఢిల్లీకి AI-102 విమానం లండన్‌కు మళ్లించబడింది. హీత్రూలోని మా గ్రౌండ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు . సంబంధిత వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేసారని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.

టేకాఫ్ సందర్బంగా విమానంలో మంటలు..

గత ఏడాది సెప్టెంబర లో . మస్కట్‌ నుంచి కోచికి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్‌ సందర్భంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో పాటు మొత్తం 145 మంది ప్రయాణికులున్నారు. వారిలో నలుగురు పసిపిల్లలున్నారు. వారందరిని విమానం నుంచి దించేసి సురక్షింతగా టెర్మనల్‌ బిల్డింగ్‌కు తరలించారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది. వెంటనే మరో విమానంలో ప్రయాణికులను కోచి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు  ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కాలికట్‌ నుంచి దుబాయి వెళ్లాల్సిన విమానంలో మంటలు చేలరేగినట్లు వాసన రావడంతో వెంటనే విమానాన్ని మస్కట్‌కు తరలించారు. అప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు.

 

Exit mobile version
Skip to toolbar