Air India Ahmedabad-London flight crashes: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలింది. ఈ ప్రమాదంపై ఎయిరిండియా స్పందించింది. ఏఐ171 ఫైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ఉన్నట్లు సమాచారం. కాగా, విమాన కూలిన ప్రదేశంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
ఈ ప్రమాదంపై పీఎం మోదీతోపాటు గుజరాత్, బెంగాల్, అస్సాం సీఎంలు భూపేంద్ర పటేల్, మమతా బెనర్జీ, హిమంత బిశ్వశర్మలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ విమానం టేకాఫ్ అయిన 9 నిమిషాలకే కూలింది. అలాగే విజయవాడ నుంచి పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.