AIIMS: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ వరుసగా ఆరవ రోజు కూడా పనిచేయలేదు. అత్యవసర, ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ మరియు లేబొరేటరీ విభాగాలలో పేషెంట్ కేర్ సేవలు మాన్యువల్‌గా నిర్వహించబడుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN), ఢిల్లీ పోలీసులు మరియు హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు రాన్సన్ సమ్ వేర్ దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సర్వర్ డౌన్ కు కారణమయిన హ్యాకర్లు క్రిప్టోకరెన్సీలో సుమారు రూ. 200 కోట్లను హ్యాకర్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
సర్వర్ డౌన్ అవడంతో దోపిడీ మరియు సైబర్ టెర్రరిజం కేసును నవంబర్ 25న ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) యూనిట్ నమోదు చేసింది.దర్యాప్తు సంస్థల సూచనల మేరకు ఆసుపత్రిలోని కంప్యూటర్లలో ఇంటర్నెట్ సేవలను బ్లాక్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ సర్వర్‌లో మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్‌లు మరియు న్యాయమూర్తులతోపాటు పలువురు వీఐపీల డేటాను భద్రపరిచారు.
ఇ-హాస్పిటల్ సేవలను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన నాలుగు భౌతిక సర్వర్లు డేటాబేస్‌లు మరియు అప్లికేషన్‌ల కోసం స్కాన్ చేయబడి సిద్ధం చేయబడ్డాయి. అలాగే ఎయిమ్స్ నెట్‌వర్క్ శానిటైజేషన్ పురోగతిలో ఉంది. సర్వర్‌లు మరియు కంప్యూటర్‌ల కోసం యాంటీవైరస్ పరిష్కారాలు నిర్వహించబడ్డాయి. ఇది 5,000 కంప్యూటర్లలో దాదాపు 1,200 కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేయబడింది. 50 సర్వర్‌లలో ఇరవై స్కాన్ చేయబడ్డాయి మరియు ఈ కార్యాచరణ 24 గంటలపాటు కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.