Gujarat Ex CM Vijay Rupani Dead Body found by the DNA Test: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన వారి బాడీలు మాంసపు ముద్దలుగా మారడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా బాడీలను గుర్తించి బంధువులకు వాటిని అప్పగిస్తున్నారు. అయితే అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఒక్కరు మినహా.. అందరూ మరణించారు. అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు.
కాగా ప్రమాదంలో మరణించిన మాజీ సీఎం మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు చేసి ఆయనదే అని అధికారులు నిర్ధారించారు. ప్రమాదంలో మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ఈ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. కాగా ఇప్పటివరకు 32 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయి వారిని గుర్తించారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం డీఎన్ఏ పరీక్షల అనంతరం 14 మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. మృతదేహాలు తీసుకెళ్లే వాహనాల వెంట పోలీసు ఎస్కార్ట్ ను కూడా పంపారు.