Agnibaan: ప్రైవేట్ రాకెట్ ప్రయోగం ‘అగ్నిబాణ్’ విజయవంతం

ఎట్టకేలకు దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ 'అగ్నిబాణ్'ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన అగ్నిబాణ్ ను షార్‌లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి గురువారం ఉదయం 7:15 గంటల సమయంలో రాకెట్‌ను సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించారు.

  • Written By:
  • Publish Date - May 30, 2024 / 01:45 PM IST

Agnibaan: ఎట్టకేలకు దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన అగ్నిబాణ్ ను షార్‌లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి గురువారం ఉదయం 7:15 గంటల సమయంలో రాకెట్‌ను సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించారు. ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ ప్రయోగ ప్రక్రియను ఆసాంతం పర్యవేక్షించారు. చెన్నైకు చెందిన అగ్నికుల్ కాస్కోస్ స్టార్టప్ సంస్థ.. భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. గతంలో సాంకేతిక కారణాలతో ఈ ప్రయోగం నాలుగుసార్లు వాయిదా పడగా.. ఐదోసారి విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. ఈ రాకెట్ దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు.

ప్రయోగం ఎలా జరిగిందంటే.. (Agnibaan)

చెన్నై ఐఐటీ కేంద్రంగా పని చేసే ‘అగ్నికుల్’ సంస్థ ‘అగ్నిబాణ్’ పేరిట తొలిసారి సబ్ – ఆర్బిటాల్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం దాదాపు 2 నిమిషాల పాటు సింగిల్ స్టేజ్‌లోనే జరిగింది. ప్రపంచంలోనే తొలిసారి తయారుచేసిన సింగిల్ పీస్ త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్ కాస్మోస్‌కు పేటెంట్ ఉంది. ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజితోనే నిర్ణిత కక్ష లోకి దూసుకు వెళ్ళింది . ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్లు కాగా.. దీని లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్‌లో తొలిసారి ఐథర్‌నెట్ ఆధారంగా పని చేసే ఏవియానిక్స్ వ్యవస్థను ఉపయోగించారు. పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలెట్ కంట్రోల్ సిస్టమ్ ను ఇందులో పూర్తిగా వినియోగించారు.
ప్రయోగం అదుపు తప్పితే వెంటనే దాన్ని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన టర్మినేషన్ వ్యవస్థను కూడా ఇందులో అమర్చారు. వివిధ లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీన్ని నిర్మించారు. 300 కిలోల బరువున్న ఉపగ్రహ ప్రయోగాల కోసం అగ్నికుల్ నిర్మించిన రాకెట్ సరిపోతుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.