Aditya L1 Spacecraft: సూర్యగ్రహంపై పరిశోధనలకోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్ వన్ సోలార్ మిషన్ 2024 జనవరి 6న తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. భూమికి లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న లంగ్రాజ్ పాయింట్ ఎల్ వన్‌కి మిషన్ చేరుతుందని సోమనాథ్ వివరించారు.
మన జీవితాలపై సూర్యుడి ప్రభావాన్ని..( Aditya L1 Spacecraft)
ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌నుంచి ఆదిత్య ఎల్ వన్‌ని ప్రయోగించారు. సరైన సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని సోమనాథ్ తెలిపారు. లక్ష్యాన్ని చేరుకున్నాక మిషన్ మరింత ముందుకు వెళ్ళకుండా ఇంజన్‌ని మరోసారి జ్వలింప చేస్తామని సోమనాథ్ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో సూర్యుడిపై జరిగే పరిణామాలని గమనించడానికి ఆదిత్య ఎల్ వన్ దోహదపడుతుందని సోమనాథ్ వివరించారు. ఆదిత్య ఎల్ వన్ సేకరించే డేటా కేవలం భారత దేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి ఉపయోగపడుతుందని సోమనాథ్ తెలిపారు. మన జీవితాలపై సూర్యుడి ప్రభావాన్ని కూడా ఆదిత్య ఎల్ వన్ స్టడీ చేస్తుందని సోమనాధ్ చెప్పారు.