Adani Group Shares: అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండన్ బర్గ్ రీసెర్చ్ నివేదికకు విడుదల చేసిన రెండు రోజుల తర్వాత కూడా అదానీ షేర్లు భారీగా పడిపోయాయి.
శుక్రవారం ఉదయం అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీ పతనంతో మొదలయ్యాయి.
అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేయడంతో అదానీ గ్రూప్ (Adani Group) షేర్లు వరుసగా రెండో సెషన్ లో 20 శాతం పతనమై లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి
మార్కెట్ విలువ నుంచి రూ.4,17 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి.
అదానీ గ్రూప్స్ స్టాక్స్ పతనం మొత్తం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ను సైతం ప్రభావితం చేసింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ 18.52 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 19.99 శాతం, అదానీ టోటల్ గ్యాస్ షేర్ 20 శాతం
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 16.03 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 19.99 శాతం, అదానీ విల్మర్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం క్షీణించాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కీలక సూచీలు 2 శాతానికి పైగా కుంగి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బకొట్టాయి.
రెండు రోజుల వరుస నష్టాలతో మదుపర్లు దాదాపు రూ. 10.65 లక్షల కోట్లు సంపదను కోల్పోయారు. పిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ జరగనుంది.
మరో వైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కూడా జరగనుంది. ఈ కీలక పరిణామాలకు అదానీ గ్రూప్ షేర్లు (Adani Group) పతనం కూడా తోడై ఈరోజు మార్కెట్ తీవ్ర ప్రభావం చూపింది.
ఉదయం సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో ఓ దశలో 1100 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు 874 పాయింట్ల భారీ నష్టంతో 59, 331 దగ్గర స్థిరపడింది.
నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్ లో 17, 494 దగ్గర దిగువ స్థాయికి చేరుకుంది. చివరకు 287.60 పాయింట్ల నష్టంతో 17,604.35 వద్ద ముగిసింది.
మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ తో పోలిస్తే రుపాయి మారకం విలువ 81.49 వద్ద ట్రేడ్ అయింది.
ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ , టాటా మోటార్స్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
కొటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
భారీ అమ్మకాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈరోజు ఓ దశలో 3 శాతానికి పైగా నష్టపోయాయి. రూ. 2,312 తో 10 నెలల కనిష్టానికి చేరింది.
చివరకు 1.83 శాతం నష్టపోయి రూ. 2,339 వద్ద స్థిరపడింది.
మరోవైపు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అదానీ గ్రూపు వ్యాఖ్యలను హిండెన్ బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) స్వాగతించింది.
తమ రిపోర్టుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. చేతనైతే తమపై కోర్టుకు వెళ్లాలని సవాల్ విసిరింది.
అమెరికా హెడ్ క్వార్టర్స్ గా తమ సంస్థ పనిచేస్తుందని.. కాబట్టి అక్కడి నుంచే దావా వేసుకోవచ్చని సూచించింది.
ఒక వేళ అదానీ గ్రూపు ఆరోపణలు నిరోపించుకోవడంలో ఫెయిల్ అయితే తమ నివేదికకు కట్టుబడి ఉండాలని పేర్కొంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/