Darshan Case: కన్నడ చాలేంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్ లీలలు ఒక్కొక్కటి నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన దర్శన్ ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. తన ప్రియురాలిపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడంతో ఆగ్రహంతో రేణుకా స్వామిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా పోస్ట్‌మార్టం రిపోర్టులో నివ్వెర పోయే అంశాలు వెలుగు చూశాయి. రేణుకా స్వామిని చంపడానికి ముందు అతనికి కరెంటు షాక్‌లు ఇచ్చారని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అతన్ని ఎలా చిత్ర హింసలు పెట్టి చంపింది ధన్‌రాజ్ అనే నిందితుడు కూడా తెలిపాడు. ఈ హత్య కేసుకు సంబంధించి ఈనెల 16 న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు కూడా ఇదే విషయాన్ని సోమవారం నాడు వెల్లడించారు.
కాగా ఈ హై ప్రొఫైల్ కేసును కర్ణాటక పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ హత్య కన్నడ చిత్రసీమను షాక్‌కు గురి చేసింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు అతని ప్రియురాలు పవిత్రా గౌడ్‌తో సహా మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ధన్‌రాజ్ అనే అనుమానితుడిని పోలీసులు ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేశారు. కాగా ధన్‌రాజ్ మాండ్యాలో కేబుల్ వర్కర్. రేణుకా స్వామి చిత్ర హింసల గురించి పోలీసులకు సవివరంగా తెలియజేశాడు. ఇదే కేసులో మరో నిందితుడు బెంగళూరులోని గోడౌన్‌కు ధన్‌రాజ్‌ను పిలిపించాడు. అతని పేరు నందీష్.. ఈ గోడౌన్‌లో రేణుకా స్వామికి ఎలక్ర్టిక్ షాక్ ఇచ్చేందుకు ఎలక్ర్టిక్ పరికరాలను తెప్పించాడు. కాగా ఈ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక రేణుకాస్వామి విషయానికి వస్తే అతను ఆటోరిక్షా డ్రైవర్ అని చెబుతున్నారు. అదీ కాకుండా దర్శన్ ఫ్యాన్ క్లబ్ సభ్యుడు. ఈ నెల 8న దర్శన ప్రియురాలు పవిత్ర గౌడను ఉద్దేశించి అసభ్యకర సందేశాలను పంపడంతో దర్శన్ అతనికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. వెంటనే తన అనుచరులతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించాడు. తర్వాత అతని మృతదేహం బెంగళూరులోని సుమనాహళ్లి బ్రిడ్జ సమీపంలో కనిపించింది. కాగా ఆదివారం నాడు రేణకాస్వామి కిడ్నాప్‌కు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . హత్య తర్వాత దర్శన్‌తో పాటు 12 మందిని గత మంగళవారం నాడు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఈకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.