Site icon Prime9

Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతీ మలీవాల్ పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి

Swati Maliwal

Swati Maliwal

Swati Maliwal :ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌ తనపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన అనుచరుడు దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులకు సోమవార ఉదయం ఓ కాల్‌ వచ్చింది. ఆ కాల్‌లో ఆమ్‌ఆద్మీపార్టీకి చెందిన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్‌పై దాడి జరిగిందని సమాచారం ఇచ్చారు.

మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బైభవ కుమార్‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలీవాల్‌పై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందించింది. కాగా సోమవారం ఉదయం 11.00 గంటలకు ఢిల్లీ పీసీఆర్‌కు మాజీ ఢిల్లీ కమిషన్‌ ఆఫ్‌ విమెన్‌ చీఫ్‌ నుంచి ఫోన్‌ కాల్‌ చేసి తన పై దాడి జరిగిందని చెప్పారు. స్వాతి నుంచి కాల్‌ రాగానే వెంటనే పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అయితే స్వాతి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.

కఠిన చర్యలు తీసుకోవాలి..(Swati Maliwal)

స్వాతి మలీవాల్‌పై దాడి జరిగిన వెంటనే బీజేపీ ఘాటుగా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అయితే ఆమ్‌ ఆద్మీపార్టీ మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. అయితే బీజేపీ ఢిల్లీ వైస్‌ ప్రెసిడెంట్‌ కపిల్‌మిశ్రా స్పందిస్తూ.. ఇది వాస్తవం అయితే .. అతి పెద్ద నేరం అవుతుంది.. దేశంలో గతంలో ముఖ్యమంత్రి ఇంట్లో ఇలాంటి దాడి సంఘటనలు జరగలేదని ఆయన అన్నారు. మలీవాల్‌పై దాడి చేయమని కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.ఒక వేళ స్వాతి మలీవాల్‌పై దాడి చేసింది వాస్తవమే అయితే బీజేపీకి ఆమెకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.

అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ఆమె దూరంగా ఉండటంతో ఆమ్‌ ఆద్మీ శ్రేణులు ఆమెపై భగ్గుమంటున్నారు. ప్రస్తుతం రాఘవ్‌ చద్దా కూడా విదేశాల్లో ఉంటున్నారు. కంటి ఆపరేషన్‌ కారణం చెబుతూ దేశంలోకి రాకుండా కాలయాపన చేస్తున్నారు. ఒక వేళ ఆయన కూడా ఇండియాలో కాలుమోపితే స్వాతికి పట్టిన గతే ఆయనకు పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

Exit mobile version