Site icon Prime9

Delhi Assembly sessions: 13 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్.. బయటకు లాకెళ్లారు!

AAP MLAs suspended on Day 1 of Delhi Assembly sessions: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగానికి ముందే ఆప్ ఎమ్మెల్యేలు సభలో గొడవకు దిగారు. ఆయన ప్రసంగిస్తుండగానే పలువురు ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో ఢిల్లీ మాజీ సీఎం ఆతిషీతో సహా 15 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.

కాగా, బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన మద్యం విధానంపై 14 కాగ్ రిపోర్టులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే చాలా అంశాలు బయటపడే నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలు పొడియం వద్దకు దూసుకొచ్చి నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు.

Exit mobile version
Skip to toolbar