Maharashtra: మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవారం హైవేపై ఉన్న హోటల్‌లోకి ట్రక్కు దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.రాష్ట్ర రాజధాని ముంబయ్ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
బ్రేకులు ఫెయిల్ అవడంతోనే..(Maharashtra)
ట్రక్కు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో దాని డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వెనుకవైపు నుంచి రెండు మోటార్‌సైకిళ్లు, కారు, మరో కంటైనర్‌ను ఢీకొట్టింది.ట్రక్కు హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న హోటల్‌పైకి దూసుకెళ్లి బోల్తా పడిందని అధికారి తెలిపారు.మధ్యప్రదేశ్ నుంచి ధులే వైపు ట్రక్కు వెళ్తోంది. బాధితుల్లో స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న వారిలో కొందరు ఉన్నారని అన్నారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను శిర్పూర్, ధూలేలోని ఆసుపత్రులకు తరలించారు.