Site icon Prime9

Chai Reel : రీల్స్‌ పిచ్చి.. రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్‌.. తర్వాత ఏమైందంటే?

Chai Reel

Chai Reel

Chai Reel : రోజురోజుకూ ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. రీల్స్‌ పిచ్చిలో ఏదీ పడితే అది చేస్తున్నారు. రీల్స్ చేసి అదే తమ సృజనాత్మకగా ఊహల్లో తేలిపోతున్నారు కొందరు. సోషల్‌ మీడియా వేదికగా లైకుల కోసం సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్న ఘటనలు కొకొల్లలు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఆకతాయి కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుని టీ తాగుతూ రీల్‌ చేశాడు. ఈ ఘటన వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడు పెట్టిన రీల్ సోషల్‌ మీడియాలో వేగంగా షేర్‌ కాగా, అంతేవేగంగా పోలీసులు రీల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కటకటాల్లో పెట్టారు.

 

మాగడి రోడ్డులో ఘటన..
బెంగళూరులోని మాగడి రోడ్డు మధ్యలో ఓ వ్యక్తి కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. దర్జాగా టీ తాగుతూ రీల్‌ చేశాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రజల దృష్టిని ఆకర్షించడంతో వైరల్‌ అయింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లగా, వారు వెంటనే స్పందించారు. వీడియో ఆధారంగా అతడిని గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించారు. రీల్‌ను మాగడి రోడ్డులో ఈ నెల 12వ తేదీన తీశారని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ట్రాఫిక్‌ లైన్‌ దగ్గర కూర్చుని టీ తాగితే మీకు జరిమానా పడుతుందే తప్ప ఫేమస్‌ కాలేరు. పోలీసులు మీమ్మల్ని గమనిస్తున్నారు అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఇలాంటి విపరీత ధోరణులు శిక్షార్హం అని హెచ్చరించారు.

 

 

 

Exit mobile version
Skip to toolbar