Site icon Prime9

Basanagouda : ఎమ్మెల్యే బసనగౌడకు బీజేపీ షాక్‌.. ఆరేళ్లపాటు బహిష్కరణ

Basanagouda

Basanagouda

Basanagouda : కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌పై బీజేపీ బహిష్కరణ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యేకు లేఖ రాసింది. పార్టీతోపాటు మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 10న షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంది.

 

 

ఇది పార్టీ నాకు ఇచ్చిన రివార్డు : బసనగౌడ
పార్టీ నుంచి తనను బహిష్కరించడంపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ స్పందించారు. వారసత్వ రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు బహిస్కరించినట్లు చెప్పారు. పార్టీలో సంస్కరణలు, వ్యక్తుల ఆధిపత్యాన్ని తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఉత్తర కర్ణాటకను అభివృద్ధి చేయాలని అడిగినందుకు తనను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. ముక్కుసూటిగా మాట్లాడినందుకు ఇది పార్టీ తనకు ఇచ్చిన రివార్డుగా పేర్కొన్నారు. అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఉత్తర కర్ణాటక అభివృద్ధి, హిందుత్వ కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఇదే ఉత్సాహం, దృఢ సంకల్పంతో ప్రజాసేవ చేస్తానని చెప్పారు. తనకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

Exit mobile version
Skip to toolbar