Uttar Pradesh: యూపీ బస్తీ జిల్లాలో 9 ఏళ్ల బాలుడిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ ఎస్ యు వి ఢీకొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 2వ తరగతి చదువుతున్న అభిషేక్ రాజ్‌భర్ బస్తీ జిల్లా హార్దియా పెట్రోల్ పంపు సమీపంలో స్థానిక బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేదీకి చెందిన ఎస్‌యూవీ చక్రాల కింద నలిగి చనిపోయాడు.
బాలుడిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించగా చికిత్స పొందుగూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వైరల్ కావడంతో ఆదివారం సాయంత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజాగ్రత్త, ర్యాష్ డ్రైవింగ్ లేదా బహిరంగ మార్గంలో ప్రయాణించడం వల్ల మరణానికి కారణమైన ఎస్‌యూవీ డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు బస్తీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు.
ఘటనా స్థలం నుంచి లభించిన సీసీటీవీ ఫుటేజీలో ఎంపీ, ఆయన వాహనం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీ ఎంపీపైగానీ, డ్రైవర్‌పైగానీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలి తండ్రి శత్రుఘ్న రాజ్‌భర్ తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబసభ్యులను ఓదార్చేందుకు కూడా ఎంపీ రాలేదు.