Viral Letter: లవ్ ఎఫైర్‌ ఉండే వయస్సులో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా.. యువతి లేఖ వైరల్

Viral Letter: ఓ నిరుద్యోగ యువతి రాసిన లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిరుద్యోగం గురించి తెలుపుతూ.. బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు పింకీ అనే ఓ నిరుద్యోగ యువతి ఈ లేఖ రాసింది. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి మనసులో మాట చెప్పలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.

Viral Letter: ఓ నిరుద్యోగ యువతి రాసిన లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిరుద్యోగం గురించి తెలుపుతూ.. బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు పింకీ అనే ఓ నిరుద్యోగ యువతి ఈ లేఖ రాసింది. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి మనసులో మాట చెప్పలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.

తేజస్వి యాదవ్‌కు యువతి లేఖ (Viral Letter)

మీరు లవ్ మ్యారేజీ చేసుకొని సంతోషంగా ఉన్నారు. నేను లవ్ ఎఫైర్‌లో ఉండే వయస్సులో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా అంటూ లేఖ రాసింది పింకీ అనే యవతి. దీని కారణం మీరు..మీ ప్రభుత్వమే అంటూ యువతి రాసిన లేఖ ప్రస్తుతం వైరల్  గా మారింది. నిరుద్యోగం గురించి తెలియజేస్తూ.. నేనో వ్యక్తిని ప్రేమించాను ప్రేమికుల రోజు దగ్గరపడుతోంది. అతనికి లవ్ ప్రపోజ్ చేయాలంటే నాకు జాబ్ లేదు.. నిరుద్యోగం అడ్డంగా ఉంది అంటూ తన ఆవేదనను లేఖలో తెలిపింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందంటూ.. లేఖలో యువతి పేర్కొంది.

బీహార్ లో నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు..

వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బీహార్ లో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు. ప్రభుత్వం కూడా ఉద్యోగాలను భర్తీ చేయటానికి ఆసక్తి చూపటం లేదు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ దశలో ఉద్యోగం వారి వివాహాలకు అడ్డంగా ఉందని అర్థం వచ్చేలా ఆ యువతి ఆవేదన చెందుతు లేఖ రాసింది. ప్రేమను వ్యక్తపరచటానికి నిరుద్యోగం ఆటంకంగా మారిందంటూ లేఖలో వివరించింది. కొన్ని సంవత్సరాలుగా ఆ యువతి ప్రభాత్ బంధుల్యను ప్రేమిస్తున్నానని లేఖలో వెల్లడించింది. నిరుద్యోగ స్థితి కారణంగా తన ప్రేమను తెలియజేయలేకపోతున్న అని బాధను వ్యక్తం చేసింది. ఉద్యోగం వస్తే తన ప్రేమను తెలియజేయాలని ఆశపడుతున్నాఅని తెలిపింది. మరోవైపు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంలేదని.. దీంతో తన కోరిక నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తన లెటర్ ద్వారా డైరెక్ట్ గా డిప్యూటీ సీఎంకే లేఖ రాసింది ఈ యువతి.

యువతి ఆవేదన ఇదే..

నేను పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నాను. నా పెళ్లి చేయాలని మా నాన్న తపన పడుతున్నారు. ఉద్యోగం లేకుంటే.. నా ప్రేమను వ్యక్తపరచలేను. వేరే వారితో మా నాన్న పెళ్లి చేస్తారు. ఇవన్నీ జరిగితే.. నా ప్రేమను దక్కించుకోలేనేమోనని ఆందోళన కలుగుతోంది అంటూ యువతి ఈ ఉత్తరం రాసింది. దయచేసి నాకు ఉద్యోగం రావటానికి సహాయం చేయండి.. లేదంటే నేను ప్రేమించిన వ్యక్తి మరొకరితో పెళ్లి చేసుకుంటాడని బాధను వ్యక్తం చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ లేఖ వైరల్ గా మారింది.