Indigo Flight Emergency Landing due to Women Death: ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు మృతిచెందింది. ఈ సంఘటన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌లో జరిగింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం ఇండిగో ఎయిలైన్స్ విమానం ప్రయాణికులతో మహారాష్ట్ర నుంచి వారణాసికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఓ ప్రయాణికురాలు (89) అస్వస్థతకు గురైంది. ఆమె పరిస్థితి గమనించిన తోటి ప్రయాణికులు సిబ్బందికి విషయం తెలియజేశారు. అప్రమత్తమైన సిబ్బంది విషయాన్ని ఎయిలైన్స్‌కు అందించారు. ఆమెకు వైద్య సాయం అవసరం ఉండడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి పరిస్థితి నెలకొంది. విషయం తాజాగా అధికారులు వెల్లడించారు.
రాత్రి 10 గంటలకు విమానం ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. బాధితురాలిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రయాణికురాలు ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందినదిగా గుర్తించారు. ఆమె పరిస్థితి తెలిసిన వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించామని ఎయిర్‌లైన్స్ సీనియర్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయిందని చెప్పారు. ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించామన్నారు. మిగిలిన ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.