Site icon Prime9

Dog: ఉరేసుకున్న యజమాని.. కాపాడేందుకు 4గంటలు ప్రయత్నించిన శునకం

dog

dog

Dog: ఉరేసుకున్న యజమానిని కాపాడేందుకు ఓ శునకం విఫలయత్నం చేసింది. సుమారు నాలుగు గంటలపాటు అతడిని కాపాడేందుకు శ్రమించిన తీరు అందరిని కలచివేసింది. యజమానుల పట్ల పెంపుడు జంతువుల ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది నిదర్శనంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

శునకం ప్రేమ.. (Dog)

ఉరేసుకున్న యజమానిని కాపాడేందుకు ఓ శునకం విఫలయత్నం చేసింది. సుమారు నాలుగు గంటలపాటు అతడిని కాపాడేందుకు శ్రమించిన తీరు అందరిని కలచివేసింది. యజమానుల పట్ల పెంపుడు జంతువుల ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది నిదర్శనంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఆ శునకానికి యజమాని అంటే ప్రేమ, విశ్వాసం. కొన్ని పెంపుడు జంతులు ఎంత ప్రేమగా ఉంటాయో వాటిని వివరించడానికి మాటలు ఉండవు.

యజమానుల పట్ల అవి చూపించే ప్రేమ.. కొన్ని సందర్భాల్లో మనుషుల్లో కూడా ఉండదు. అలాంటిది తన యజమాని ఆత్మహత్య చేసుకుంటే ఆ శునకం చూడలేకపోయింది.

అతడిని కాపాడేందుకు దాదాపు నాలుగు గంటలు శ్రమించింది. అయినా దాని వల్ల కాలేదు.. చివరికి పోలీసులు, స్థానికులు వచ్చి యజమాని డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చారు.

అయితే కొంత సమయానికే ఆ శునకం కూడా చనిపోయింది.

ఉత్తరప్రదేశ్ లోని పంచవటి కాలనీలోని సంభవ్‌ అగ్నిహోత్రి అనే 23 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. అతడు సివిల్స్‌ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాడు.

యువకుడి తండ్రి.. రైల్వే శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో.. ఉరి వేసుకున్నాడు.

యువకుడికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇంటిపక్కనే ఉన్నవారికి ఫోన్ చేసి ఆరా తీశారు. పక్కింటివారు వెళ్లి చూడగా.. వారిపై అలెక్స్‌ అనే శునకం దాడి చేసింది.

అప్పటికే ఆ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులను సైతం అది ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో శునకానికి మత్తుమందు ఇచ్చి బంధించారు.

కాసేపటికే అలెక్స్‌ కూడా కాసేపటికే మరణించడం గమనార్హం. శునకానికి అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్లే మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు

Exit mobile version