Site icon Prime9

Air India flight smoking case: ఎయిర్ ఇండియా విమానంలో పొగతాగిన అమెరికన్ పౌరుడిపై కేసు నమోదు

Air India flight

Air India flight

Air India flight smoking case: ఎయిర్ ఇండియా లండన్-ముంబై విమానంలో బాత్రూమ్‌లో ధూమపానం చేయడం మరియు ఇతర ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై అమెరికా పౌరుడిపై కేసు నమోదయింది.ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 11న విమానం మధ్యలో అసౌకర్యం కలిగించినందుకు 37 ఏళ్ల రమాకాంత్‌పై సహర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 336 (మానవ ప్రాణాలకు లేదా ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా ఎవరైనా ఏదైనా అత్యుత్సాహంతో లేదా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే), ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1937, 22 కింద, పైలట్-ఇన్-కమాండ్ ఇచ్చిన చట్టబద్ధమైన సూచన), 23 (దాడి మరియు భద్రతకు హాని కలిగించే లేదా క్రమశిక్షణకు హాని కలిగించే ఇతర చర్యలు) మరియు 25 (ధూమపానం కోసం) కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

బాత్రూమ్ లో సిగరెట్ తాగుతూ ..(Air India flight smoking case)

విమానంలో ధూమపానం అనుమతించబడదు. కాని అతను బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు అలారం మోగడం ప్రారంభించింది మేము అందరం బాత్రూమ్ వైపు పరిగెత్తినప్పుడు అతని చేతిలో సిగరెట్ ఉంది. మేము వెంటనే అతని చేతిలోని సిగరెట్  లాక్కున్నాము. రమాకాంత్ మా క్రూ సభ్యులందరిపై అరవడం మొదలుపెట్టాడు. ఎలాగోలా అతనిని తన సీటుకు చేర్చాము. అయితే కొంతసేపటి తర్వాత విమానం తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు. అతని ప్రవర్తన చూసి ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు . అతను విమానంలో జిమ్మిక్కులు చేయడం ప్రారంభించాడు. అతను మా మాట వినడానికి సిద్ధంగా లేడు.అప్పుడు మేము అతని చేతులు మరియు కాళ్ళు కట్టి, అతనిని సీటుపై కూర్చోబెట్టాము”అని ఎయిర్ ఇండియా సిబ్బంది సహర్ పోలీసులకు చెప్పారు.

వైద్యపరీక్షల కోసం నిందితుడి నమానా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులలో ఒక వ్యక్తి వైద్యుడు. అతను వచ్చి అతనిని తనిఖీ చేసాడు. అప్పుడు రమాకాంత్ తన బ్యాగ్‌లో మందులు ఉన్నాయని చెప్పాడు, కానీ మాకు ఏమీ కనిపించలేదు కానీ బ్యాగ్‌ని తనిఖీ చేయగా ఇ-సిగరెట్ బయటపడింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణికుడు రాంకాంత్‌ను సహార్ పోలీసులకు అప్పగించారు అక్కడ అతన్ని అదుపులోకి తీసుకుని ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా లేక మానసిక క్షోభకు గురయ్యాడా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి నమూనాను పంపామని పోలీసులు తెలిపారు.నిందితుడు భారతీయ మూలానికి చెందినవాడని, అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పౌరుడు మరియు యుఎస్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడని వారు ధృవీకరించారు.

Exit mobile version